ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

STSS: 48 గంటల్లో మరణమే.. జపాన్‌లో వ్యాపిస్తున్న అరుదైన వ్యాధి

ABN, Publish Date - Jun 16 , 2024 | 04:44 PM

కొవిడ్ మహమ్మారి పీడ విరగడవడంతో ఊపిరిపీల్చుకుంటున్న వేళ మరో అరుదైన కలవరానికి గురిచేస్తోంది. జపాన్‌లో స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అనే బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇది అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి అని, ఇది సోకితే 48 గంటల్లోనే మరణిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి

కొవిడ్ మహమ్మారి పీడ విరగడవడంతో ఊపిరిపీల్చుకుంటున్న వేళ మరో అరుదైన కలవరానికి గురిచేస్తోంది. జపాన్‌లో స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అనే బ్యాక్టీరియా వ్యాపిస్తోంది. ఇది అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధి అని, ఇది సోకితే 48 గంటల్లోనే మరణిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. జూన్ 2 నాటికి జపాన్‌లో మొత్తం కేసుల సంఖ్య 977కి చేరింది. గతేడాది అక్కడ మొత్తం 941 కేసులు నమోదు కాగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే అంతకమించిన సంఖ్యలో కేసులు నమోదయ్యాయని జపాన్ ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ గణాంకాలు స్పష్టం చేశాయి. 1999 నుంచి ఈ వ్యాధిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపింది.


గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్‌కు (GAS) చెందిన ఈ బ్యాక్టీరియా సోకితే సాధారణంగా పిల్లలలో వాపు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇదే బ్యాక్టీరియాలోని కొన్ని రకాల వేరియెంట్లు సోకితే తీవ్రమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. శరీర అవయవాల నొప్పి, వాపు, జ్వరం, తక్కువ బీపీ, తోలు ఊడిపోవడం, శ్వాస సంబంధ సమస్యలు, అవయవాల వైఫల్యం, మరణం వంటి తీవ్రమైన పరిస్థితులకు ఈ వ్యాధి దారితీస్తోంది. ఇక 50 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఈ వ్యాధి చాలా ప్రమాదకరమైనదని జపాన్ వైద్య నిపుణులు చెబుతున్నాయి.


ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మరణాలు 48 గంటల్లోనే సంభవిస్తున్నాయని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీలో అంటు వ్యాధుల ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కెన్ కికుచి వెల్లడించారు. వ్యాధి సోకిన కొన్ని గంటల్లోనే వాపు పాదాల్లో మొదలై మోకాలి వరకు వ్యాపిస్తోందని, 48 గంటల్లో చనిపోతున్నారని కికుచి వివరించారు. కాగా జపాన్‌తో పాటు ఇతర దేశాలకు ఈ వ్యాధి వ్యాపించినట్టు గుర్తించారు. 2022 ఏడాది చివరిలో యూరోపియన్ యూనియన్‌లోని 5 దేశాల్లో కూడా గ్రూప్ ఏ స్ట్రెప్టోకోకస్‌ కేసులను గుర్తించారు. ఇందులో ఎస్‌టీఎస్ఎస్ కేసు కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద సమాచారం ఉంది. కాగా కొవిడ్ ఆంక్షలు పూర్తిగా సడలిపోయిన తర్వాత ఎస్‌టీఎస్ఎస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత ఏడాది జపాన్‌లో 2,500 వరకు కేసులు నమోదయే అవకాశం ఉందని, 30 శాతం మరణాలు సంభవించవచ్చునని కికుచి ఆందోళన వ్యక్తం చేశారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శరీరంపై పైకి కనిపించే గాయాలు అయినప్పుడు కచ్చితంగా చికిత్స చేయించుకోవాలని కిచుకు హెచ్చరించారు.

Updated Date - Jun 16 , 2024 | 04:44 PM

Advertising
Advertising