ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vladimir Putin: గూఢచారి నుంచి అధ్యక్షుడి దాకా.. వ్లాదిమిర్ పుతిన్ గురించి సంచలన విషయాలు

ABN, Publish Date - Mar 18 , 2024 | 05:26 PM

వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin).. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రష్యా (Russia) పాలనా పగ్గాలను తన చేతుల్లోనే ఉంచుకున్న ఆయన.. 24 ఏళ్లుగా అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి రష్యా అధ్యక్ష ఎన్నికల్లో (Russia Presidential Election 2024) 87.97% ఓట్లతో గెలుపొంది.. భారీ విజయాన్ని సాధించారు.

వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin).. ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రష్యా (Russia) పాలనా పగ్గాలను తన చేతుల్లోనే ఉంచుకున్న ఆయన.. 24 ఏళ్లుగా అధికారంలోనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి రష్యా అధ్యక్ష ఎన్నికల్లో (Russia Presidential Election 2024) 87.97% ఓట్లతో గెలుపొంది.. భారీ విజయాన్ని సాధించారు. ఫలితంగా.. మరో ఆరేళ్ల పాటు, అంటే 2030 వరకూ ఆయన రష్యా అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. ఈ పదవీకాలం పూర్తయితే, రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా పుతిన్ సరికొత్త రికార్డ్ సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలోనే.. పుతిన్ ప్రస్థానం ఎలా సాగిందో ఓసారి పరిశీలిద్దాం.


గూఢచారి నుంచి అధ్యక్షుడి దాకా..

పుతిన్ ప్రస్థానం ఒక గూఢచారిగా ప్రారంభమైంది. న్యాయశాస్త్రం పూర్తిచేసిన ఆయన 1975లో రష్యా గూఢచార సంస్థ కేజీబీలో (KGB) చేరారు. 1991లో సోవియట్ యూనియన్ (Soviet Union) పతనం తరువాత.. రష్యా ఆర్థిక సంక్షోభాన్ని (Russia Financial Crisis), రాజకీయ తిరుగుబాటును ఎదుర్కొంది. అలాంటి గందరగోళ వాతావరణంలో పుతిన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలుత సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 1998లో రష్యా సెక్యూరిటీ సర్వీస్‌కు అధిపతిగా నియమితులయ్యారు. అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్‌ యెల్సిన్‌ (Boris Yeltsin) ఆయనకు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. ఆ తర్వాతి ఏడాదిలోనే.. అంటే 1999లో బోరిస్ అప్పటి ప్రధానమంత్రిని తొలగించి, ఆయన స్థానాన్ని పుతిన్‌తో భర్తీ చేశారు. కొన్ని నెలల్లోనే బోరిస్ రాజీనామా చేయడంతో.. పుతిన్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. అప్పటి నుంచే పుతిన్ తన చక్రం తిప్పడం మొదలుపెట్టారు.

2000లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన పుతిన్.. 2004లోనూ రెండోసారి ఆ పదవిని చేపట్టారు. అయితే.. రాజ్యాంగ ప్రకారం మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడంతో.. 2008లో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఆ సమయంలోనే రాజ్యాంగాన్ని సవరించి.. అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచారు. 2012లో మరోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2018లో నిర్వహించిన ఎన్నికల్లోనూ గెలుపొంది.. నాలుగోసారి అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలుపొందడంతో.. ఐదోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇలా 1999లో తొలిసారి రష్యా పాలనా పగ్గాలు చేపట్టిన పుతిన్‌.. గత 24 ఏళ్లుగా ఆ దేశ ప్రధానిగా, అధ్యక్షుడిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే.. తన పదవీకాలంలో పుతిన్ నిరంకుశ పోకడల కారణంగా విమర్శల్ని ఎదుర్కున్నారు. ఏదేమైనా.. పుతిన్ పాలన ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక రాజకీయ దృఢత్వంతో కూడి ఉంది. ఆయన నాయకత్వంలో రష్యా ఆర్థిక మాంద్యం నుంచి పుంజుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 05:26 PM

Advertising
Advertising