Pakistan: రూ.50కే షర్ట్ అని ఆఫర్.. ఏం చేశారంటే..
ABN, Publish Date - Sep 02 , 2024 | 07:55 AM
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశం ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు.
కరాచీ: రూ.50కే షర్ట్ ఆఫర్.. అది కూడా ఒక్క రోజేనని ప్రకటించారు. ఆ మాల్ వద్దకు జనం ఎగబడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా లక్ష మంది వరకు వచ్చారు. ఆ రద్దీని కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బంది వల్ల కాలేదు. పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఇంకేముంది ప్రారంభించిన అరగంటకే ఆ షాపింగ్ మాల్ మొత్తం లూటీ అయ్యింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) జరిగింది.
ఆఫర్ పెడితే..
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త విదేశాల్లో ఉంటున్నారు. ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. దేశం ఉన్న ప్రజలకు ఏమైనా చేయాలనే ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ఇక్కడ ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందుబాటులో ఉంటాయి. డ్రీమ్ బజార్‌లో ఉండే వస్తువులు అన్ని సెకండ్ హ్యాండ్‌వే. డ్రీమ్ బజార్ ఓపెనింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేశారు. రూ.50కే షర్ట్, తక్కువ ధరకు వస్తువులు, ఇంటికి అవసరమైన వస్తువులు అని ప్రకటించారు. ఇంకేముంది జనం నుంచి ఊహించని రీతిలో స్పందన వచ్చింది.
అరగంటలో మాల్ ఖాళీ
ఆఫర్ ప్రకటించడంతో చాలా మంది వచ్చారు. డ్రీమ్ బజార్ మాల్ బయట వందల్లో జనం వెయిట్ చేశారు. బయట ఉన్న ప్రజలను కంట్రోల్ చేయడం సిబ్బంది వల్ల కాలేదు. నిలువరించేందుకు డోర్ క్లోజ్ చేశారు. అది గ్లాస్ డోర్ కావడంతో నియంత్రించడం కుదరలేదు. అయినప్పటికీ డోర్ మూసి వేశారు. గ్లాస్ డోర్‌ను ధ్వంసం చేసి డ్రీమ్ బజార్‌లోకి చొచ్చుకొచ్చారు. అంతమంది ఓకేసారి రావడంతో సిబ్బంది చేతెలెత్తేశారు. పోలీసులు పక్కన ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. మాల్‌లోకి వచ్చిన ఒక్కొక్కరు తమకు వచ్చిన వస్తువులు, డ్రెస్సులు తీసుకొని వెళ్లిపోయారు. ఇక బిల్లింగ్ అనే మాట లేనే లేదు. అరగంటలో మాల్ మొత్తం ఖాళీ చేశారు.
మరొకరు ముందుకు రారు..
మాల్‌ను దోపిడీ చేయడంపై అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. ‘విదేశాల్లో ఉండే వ్యాపారవేత్త మంచి ఉద్దేశంతో డ్రీమ్ బజార్ నెలకొల్పారు. ప్రజలకు తక్కువ ధరలో వస్తువులు అందజేయాలని సంకల్పంతో ముందుకొచ్చారు. ఆయను అనుకున్నది వేరు.. ఇక్కడ జరిగింది వేరు. పాకిస్థాన్ ఎన్నడూ మారదు. ఇక్కడి ప్రజల తీరు వల్లే దేశం మరింత వెనకబడిపోతుంది అని’ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
For Latest News click here
Updated Date - Sep 02 , 2024 | 09:31 AM