ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Google - Russia: భూమిపై చలామణీలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా.. గూగుల్‌కు రష్యా బిగ్ షాక్

ABN, Publish Date - Nov 01 , 2024 | 12:34 PM

రష్యా ప్రభుత్వ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లను యూట్యూబ్‌లో బ్యాన్ చేయడంపై రష్యా ఆగ్రహించింది. దీంతో గూగుల్‌కు మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌కు ఏకంగా 20 డెసిలియన్‌ డాలర్ల జరిమాన విధిస్తూ రష్యా కోర్టు తీర్పునిచ్చింది. 20 డెసిలియన్ డాలర్లు అంటే 2 అంకె తర్వాత ఏకంగా 34 సున్నాలు ఉంటాయి.

Google Russia

సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు రష్యా కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చింది. ఈ భూమిపై చెలామణిలో ఉన్న డబ్బు కంటే ఎక్కువ జరిమానా విధించింది. ఇప్పుడున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎన్నో రెట్లు ఈ ఫైన్ ఉంటుంది. ఖగోళ గణాంకాల కోసం వినియోగించేంత పెద్ద సంఖ్యలో జరిమానా వేసింది. మరి గూగుల్‌కు రష్యా ఈ స్థాయిలో జరిమానా విధించడానికి కారణం ఏంటి? వివాదం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం...

రష్యా ప్రభుత్వ మీడియాకు చెందిన కొన్ని ఛానళ్లను యూట్యూబ్‌లో బ్యాన్ చేయడంపై రష్యా ఆగ్రహించింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలోని యూట్యూబ్‌కు ఏకంగా 20 డెసిలియన్‌ డాలర్ల జరిమానా విధిస్తూ రష్యా కోర్టు సంలచన తీర్పునిచ్చింది.


20 డెసిలియన్ డాలర్లు అంటే 2 అంకె తర్వాత ఏకంగా 34 సున్నాలు ఉంటాయి. ఈ స్థాయి నంబర్లను ఖగోళ శాస్త్రాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాయి. ఈ భారీ జరిమానాను భూమిపై జరిగే లావాదేవీలతో పోల్చలేం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనేక రెట్లు ఉంటుంది. యూట్యూబ్‌లో రష్యా ప్రభుత్వ మద్దతున్న మీడియా ఛానళ్లను నియంత్రించి గూగుల్ తప్పు చేసిందని, రష్యా జాతీయ ప్రసార నిబంధనలను ఉల్లంఘించిందని రష్యన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాన్ చేసిన ఛానళ్లను పునరుద్ధరించాలని, 9 నెలల వ్యవధిలో తీర్పుని పునరుద్ధరించకపోతే జరిమానా ప్రతిరోజూ రెట్టింపు అవుతుందని న్యాయస్థానం హెచ్చరించింది.


ఉక్రెయిన్‌పై దాడి తర్వాత ఆంక్షలు..

కాగా ఉక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా ఛానెల్‌లను యూట్యూబ్ నియంత్రించింది. ఆర్‌టీ, స్పుత్నిక్‌తో పాటు పలు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఛానెళ్లపై అంతర్జాతీయంగా నిషేధం విధించింది. ఈ వివాదం మార్చి 2022లో మొదలైంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక కంటెంట్ పాలసీలకు వ్యతిరేకంగా హింసాత్మక కంటెంట్‌ను చూపిస్తున్నారంటూ యూట్యూబ్ ఈ నిషేధం విధించింది. గైడ్‌లైన్స్ పాటించలేదంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 1,000 యూట్యూబ్ ఛానళ్లు, 15,000 కంటే ఎక్కువ వీడియోలను తొలగించింది.


మా మీడియాపై అణిచివేత: రష్యా

ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో రష్యాను సమర్థించే కథనాలను ప్రసారం చేసిన ఛానెళ్లకు వ్యతిరేకంగా యూట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంటుందని రష్యా ఆరోపించింది. యూరప్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఛానళ్లపై నిషేధం విధించడానికి ముందే రష్యన్ ప్రభుత్వ మీడియా ఛానళ్లపై ఆంక్షలు విధించిందని పేర్కొంది. యూట్యూబ్ చర్యలు తమ దేశ సెన్సార్‌షిప్, ప్రభుత్వ-ప్రాయోజిత మీడియా అణచివేతగా రష్యా అభివర్ణించింది.

యూట్యూబ్ ఆంక్షలపై రష్యాకు చెందిన 7 బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఉమ్మడిగా చట్టపరంగా కోర్టును ఆశ్రయించాయి. గూగుల్‌కి వ్యతిరేకంగా కోర్టులో దావాలు దాఖలు చేశాయి. తమ ఛానెళ్లను పునరుద్ధరించాలని బ్రాస్ట్ కాస్టర్లు డిమాండ్ చేశారు. కాగా గూగుల్ కంపెనీ 2020 నుంచి రష్యా జరిమానాలను ఎదుర్కుంటోంది. రష్యా ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థలు త్సాన్‌గ్రాడ్, రియా ఫాన్‌లను యూట్యూబ్‌లో బ్లాక్ చేసినందుకుగానూ రోజుకు సుమారు 1,028 డాలర్ల చొప్పు జరిమానాను ఎదుర్కొంది.


రష్యాలో కార్యకలాపాలు తగ్గించిన గూగుల్..

2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం మొదలుపెట్టాక రష్యాలో కార్యకలాపాలను గూగుల్ గణనీయంగా తగ్గించింది. అయితే పూర్తిగా ఆ దేశం నుంచి నిష్క్రమించలేదు. యూట్యూబ్, గూగుల్ సెర్చింగ్ వంటి సేవలు కొనసాగుతున్నాయి. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు రష్యాలో తమ కార్యాకలాపానలు పూర్తిగా ఉపసంహరించుకున్నప్పటికీ గూగుల్ మాత్రం పాక్షికంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

రష్యా ప్రభుత్వం తమ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన కొన్ని నెలల తర్వాత అక్కడి గూగుల్ విభాగం కోర్టులో దివాళా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ కోర్టులో నడుస్తున్నప్పటికీ పాక్షిక సేవలను కొనసాగిస్తూనే ఉండడం గమనార్హం. ప్రస్తుతం రష్యాలో యూట్యూబ్ అందుబాటులో ఉన్నప్పటికీ రష్యన్ మీడియా ఛానెల్‌పై ఆంక్షలను కొనసాగిస్తే ప్లాట్‌ఫారమ్‌ను పూర్తిగా బ్లాక్ చేస్తామని రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా ఉక్రెయిన్‌పై దాడి మొదలైన నాటి నుంచి రష్యా వ్యతిరేక లేదా ఉక్రెయిన్ అనుకూల కంటెంట్‌ని ప్రసారం చేసిన విదేశీ టెక్ ప్లాట్‌ఫామ్స్‌పై రష్యా అనేక రకాల జరిమానాలు విధించడం గమనార్హం.

Updated Date - Nov 01 , 2024 | 12:35 PM