Global Business : భారత్‌లో పెట్టుబడులు లాభదాయకం
ABN, Publish Date - Dec 06 , 2024 | 04:59 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘భారతదేశమే ముందు(ఇండియా ఫస్ట్)’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. బుధవారం మాస్కోలో నిర్వహించిన 15వ వీటీబీ రష్యా కాలింగ్
మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ భేష్: పుతిన్
మాస్కో, డిసెంబరు 5: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘భారతదేశమే ముందు(ఇండియా ఫస్ట్)’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. బుధవారం మాస్కోలో నిర్వహించిన 15వ వీటీబీ రష్యా కాలింగ్ ఇన్వె్‌స్టమెంట్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమన్నారు. భారత్‌లో తయారీరంగ పరిశ్రమల ఏర్పాటుకు రష్యా కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది రష్యాకు చెందిన ‘ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రాం’ లాంటిదేనని వివరించారు. ‘ఇలాంటి కార్యక్రమాన్నే మేక్ ఇన్ ఇండి యా పేరిట మోదీ ప్రారంభించారు. భారత్‌లో త యారీ కార్యకలాపాలు చేపట్టేందుకు మనం కూడా సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం లాభదాయకమని మేం భావిస్తున్నాం’ అన్నారు. రష్యా ఇంధన దిగ్గజం రోజ్‌నెఫ్ట్ ఇటీవలే భారత్‌లో రూ.1.70 లక్షల కోట్లు(20 బిలియన్ డాలర్లు) పెట్టుబడిపెట్టిన విషయాన్ని పుతిన్ ప్రస్తావించారు. ఉత్ప త్తి రంగం వృద్ధి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం అనుకూల పరిస్థితులను సృష్టించడంలో భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
Updated Date - Dec 06 , 2024 | 04:59 AM