సిరియాలో 300 మంది రెబల్స్ హతం
ABN, Publish Date - Dec 02 , 2024 | 03:10 AM
సిరియాలో మళ్లీ అంతర్యుద్ధ భయాందోళనలు నెలకొంటున్న వేళ ఆ దేశానికి రష్యా మద్దతుగా నిలిచింది.
అలెప్పో, డిసెంబరు 1: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధ భయాందోళనలు నెలకొంటున్న వేళ ఆ దేశానికి రష్యా మద్దతుగా నిలిచింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అస్సద్‌కు వ్యతిరేకంగా ఒకప్పటి అల్‌ఖైదా అనుబంధ సంస్థ హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఒక్కో పట్టణాన్ని ఆక్రమిస్తూ వెళుతున్న క్రమంలో ఆదివారం తాము సిరియాలో తిరుగుబాటుదారులపై వైమానిక దాడులు జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ దాడుల్లో హయాత్ తహ్‌రీర్ అల్- షమ్ సంస్థ ముఖ్య నాయకులు అహ్మద్ హుస్సేన్ అల్ షరా, అకా అబూ మహమ్మద్ అల్ జురానీ సహా 300 మంది తిరుగుబాటుదారులు మృతి చెందినట్లు వెల్లడించింది. కాగా, ఆదివారం తిరుగుబాటుదారులు సిరియాలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పోను ఆక్రమించారు.
Updated Date - Dec 02 , 2024 | 03:10 AM