ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bumper Offer: యువతులకు బంపరాఫర్.. బిడ్డను కంటే రూ.92 వేలు బహుమానం!

ABN, Publish Date - Jul 13 , 2024 | 03:37 PM

యూనివర్సిటీలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తే.. రూ.92 వేలు బహుమానంగా ఇస్తామని ప్రకటించింది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

Bumper Offer

భారత్‌లో మినహాయిస్తే.. విదేశాల్లో జననాల రేటు బాగా తగ్గిపోయింది. పెళ్లిళ్లపై, పిల్లలు కనడంపై యువత ఆసక్తి చూపకపోవడంతో.. జనన రేటు గణనీయంగా పడిపోయింది. దీంతో.. సంతానోత్పత్తిని పెంచేందుకు గాను ఆయా దేశాల ప్రభుత్వాలు వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రకరకాల సంక్షేమాలు అందిస్తున్నాయి. అలాంటి దేశాల్లో రష్యా కూడా ఒకటి. అసలే అక్కడ జనాభా తక్కువగా ఉండటం, ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా మరణాలు సంభవించడం, చాలామంది దేశం విడిచి వెళ్లిపోవడంతో.. జననాల రేటు పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది.


ఇందులో భాగంగానే.. వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్‌ ఆఫ్‌ కరేలియా అధికారులు తాజాగా ఓ బంపరాఫర్ ప్రకటించారు. స్థానిక యూనివర్సిటీ, కాలేజీల్లో చదివే యువతులు (25 ఏళ్లలోపు).. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తే, రూ.92 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. అంతేకాదు.. బిడ్డకు జన్మనిచ్చే తల్లి వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలని షరతు విధించారు. ఒకవేళ చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే.. తల్లులకు ఏమాత్రం బోనస్ లభించిందని ఆ చట్టం స్పష్టంగా పేర్కొంది. అయితే.. వైకల్యం ఉన్న పిల్లలకు జన్మనిచ్చినా తల్లులకు బోనస్ ఇస్తారా లేదా? అనేది వెల్లడించలేదు. అలాగే.. బిడ్డకు జన్మినిచ్చాక వారి ఆలనాపాలనా కోసం అయ్యే ఖర్చులు భరిస్తారా? అనే దానిపై కూడా క్లారిటీ లేదు.


కాగా.. జనాభా సంక్షోభాన్ని రష్యా ఎదుర్కుంటుండటంతో, ఆ దేశ మహిళలపై పిల్లలు కనాలన్న ఒత్తిడి పెరుగుతోంది. స్వయంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని మహిళలకు కోరారు. దీనిని ఒక కట్టుబాటుగా పరిగణించాలని పేర్కొన్నారు. మరోవైపు.. కండోమ్‌ల వంటి గర్భనిరోధకాలను నిషేధించడానికి కొత్త పద్ధతులను అన్వేషించేందుకు గాను కొన్ని ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. మరి.. కొత్తగా ప్రకటించిన బంపరాఫర్‌ను యువతులు వినియోగించుకుంటారా? లేదా? అనేది వేచి చూడాలి.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 03:37 PM

Advertising
Advertising
<