ఉక్రెయిన్‌పై.. రష్యా ఖండాంతర క్షిపణి దాడి
ABN, Publish Date - Nov 22 , 2024 | 06:52 AM
అమెరికా నిఘావర్గాలు హెచ్చరించినట్లుగానే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సహా.. పలు నగరాలను రష్యా టార్గెట్‌గా చేసుకుంది. వెయ్యి రోజులు దాటిన ఈ యుద్ధంలో రష్యా తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన
ఆర్‌ఎస్-26 రూబెజ్‌గా అనుమానాలు!
ఒక కింజాల్, ఏడు కేహెచ్-101తో బీభత్సం
26 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కీవ్, నవంబరు 21: అమెరికా నిఘావర్గాలు హెచ్చరించినట్లుగానే ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ సహా.. పలు నగరాలను రష్యా టార్గెట్‌గా చేసుకుంది. వెయ్యి రోజులు దాటిన ఈ యుద్ధంలో రష్యా తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన గురువారం పేర్కొంది. రష్యాలోని అస్ట్రాఖన్ రీజియన్ నుంచి ప్రయోగించిన ఆ క్షిపణి డెనిపర్ నగరంపై పడ్డట్లు పేర్కొంది. అయితే.. కచ్చితంగా ఏరకం క్షిపణి అనే విషయాన్ని వెల్లడించలేదు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఖండాంతర క్షిపణితోపాటు.. ఒక ఎక్స్-47ఎం2 కింజాల్ బాలిస్టిక్ క్షిపణి, ఏడు కేహెచ్-101 క్రూయిజ్ క్షిపణులను కీవ్‌పై ప్రయోగించినట్లు తెలిపింది. క్రివిరి్‌హలో జరిగిన దాడిలో 26 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరు మహిళల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. కీవ్‌పై రష్యా క్షిపణిదాడులు చేసే ప్రమాదముందని అమెరికా బుధవారమే హెచ్చరించింది. కీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే..! ఖండాంతర క్షిపణి దాడిపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ప్రయోగించిన బ్రిటిష్ తయారీ స్టామ్‌షాడో క్రూయిజ్ మిసైల్‌ను గాల్లోనే పేల్చేసినట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించింది. అయితే.. ఉక్రెయిన్‌పై ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ఆర్‌ఎస్-26 రూబెజ్ అయ్యి ఉండొచ్చని రష్యా మీడియా పేర్కొంది. రాయిటర్స్ మాత్రం ఆర్‌ఎస్-26 రూబెజ్ క్షిపణిని ప్రయోగించినట్లు నిర్ధారిస్తూ.. ఈ మిసైల్ 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని వివరించింది.
Updated Date - Nov 22 , 2024 | 06:52 AM