ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దుర్గా పూజపై బంగ్లాదేశ్‌లో ఆంక్షలు

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:50 AM

బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనుస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి.

  • జిజియా పన్ను చెల్లించాలని నిర్వాహకులకు హుకుం

ఢాకా, అక్టోబరు 3: బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనుస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇప్పుడు దుర్గాపూజోత్సవాలపై ఆంక్షలు విధించారు. పూజలు నిర్వహించుకోవాలంటే రూ.5 లక్షలు జిజియా పన్ను చెల్లించాలని అజాన్‌, నమాజ్‌ సమయంలో సంగీత వాయిద్యాలు వాయించరాదని కూడా హుకుం జారీ చేశారు. చాలా చోట్ల అనుమతి కూడా నిరాకరిస్తున్నారు. బంగ్లాదేశ్‌లోని డెయిలీ స్టార్‌ పత్రిక కథనం ప్రకారం దుర్గా పూజలు నిర్వహించుకోవాలంటే రూ.5 లక్షలు జిజియా పన్ను చెల్లించాలంటూ నిర్వాహక కమిటీలకు బెదిరింపు లేఖలు అందాయి.

దీనికి సంబంధించి ఖుల్నాలోని డకోప్‌ ప్రాంతంలో పలు హిందూ దేవాలయ ప్రతినిధులు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కాగా, బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వం భారత్‌నుంచి ఆదేశ హై కమిషనర్‌ ముస్తఫిజుర్‌ రెహమాన్‌ను వెనక్కి పిలిపించుకుంది. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు మహ్మద్‌ తౌహిద్‌ హుసేన్‌తో భారత హై కమిషనర్‌ ప్రణయ్‌ వర్మ చర్చలు జరిపిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Oct 04 , 2024 | 03:51 AM