Sheikh Hasina: బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. ఎప్పుడంటే..?
ABN, Publish Date - Aug 09 , 2024 | 11:07 AM
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మహ్మద్ యూనాస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాదేశ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి.
బంగ్లాదేశ్‌లో (Bangladesh) పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయి. మహ్మద్ యూనాస్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరింది. ఇంతలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సజీబ్ వాజద్ జాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బంగ్లాదేశ్‌లో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడింది. పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. మహ్మద్ యూనాస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు నిర్వహిస్తే.. నా తల్లి షేక్ హసీనా బంగ్లాదేశ్ తిరిగి వస్తారు. ఆందోళనలతో నా తల్లి భారత్‌లో ఉంది. ఎన్నికలు నిర్వహించే సమయంలో ఆమె తప్పకుండా బంగ్లాదేశ్ వెళుతుంది అని’ స్పష్టం చేశారు. సజీబ్ వాజద్ అమెరికాలో ఉంటోన్న సంగతి తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంతో షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌తో ఎలాంటి సంబంధం లేదు. విద్యార్థులు మహ్మద్ యూనాస్ ప్రధాని పదవి చేపట్టాలని గట్టిగా కోరుకున్నారు. దాంతో యూనాస్ నిన్న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం యువత ఉద్యమించింది. ఆ నిరసనల్లో 300 మందికి పైగా చనిపోయారు. పరిస్థితి రోజు రోజుకు చేయి దాటడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తలదాచుకునేందుకు భారతదేశం నుంచి ఆశ్రయం పొందారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లాలని అనుకున్నారు. ఆ దేశం అంగీకరించలేదు. ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ గురువారం నాడు కూడా మాట్లాడారు. ఏం చర్చించారు..? బ్రిటన్ నుంచి ఏం సమాధానం వచ్చిందనే అంశం చెప్పేందుకు మాత్రం నిరాకరించారు.
Updated Date - Aug 09 , 2024 | 11:07 AM