ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Donald Trump: ట్రంప్‌పై కాల్పులు.. నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు

ABN, Publish Date - Jul 15 , 2024 | 03:39 PM

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనలో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్‌పై దాడి చేసిన థామస్...

Thomas Mathew Crooks

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కాల్పుల ఘటనలో తాజాగా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్‌పై దాడి చేసిన థామస్ మాథ్యూ క్రూక్ (Thomas Mathew Crooks).. సంఘటనా స్థలం నుంచి గంట దూరంలోనే ఉన్న క్లెయిర్‌టన్ స్పోర్ట్స్‌మెన్ క్లబ్‌లో సభ్యుడు అని తేలింది. హైస్కూల్‌లోని షూటింగ్ క్లబ్‌లో చేరేందుకు కూడా థామస్ ప్రయత్నించాడని, కానీ ఓ టెర్రిబుల్ షూటర్ కావడంతో అతడ్ని తీసుకోలేదని వెల్లడైంది. 20 అడుగుల దూరంలోనే ఉన్న లక్ష్యాన్ని సైతం అతడు మిస్ చేశాడని.. జేమ్సన్ మర్ఫీ అనే మాజీ విద్యార్థి తెలిపాడు.


‘‘స్కూల్‌లోని షూటింగ్ క్లబ్‌లో చేరేందుకు థామస్ ప్రయత్నించాడు. కానీ.. 20 అడుగుల దూరంలో ఇచ్చిన లక్ష్యాన్ని సైతం గురి పెట్టలేకపోయాడు. దాన్ని మిస్ చేశాడు. అతడు ప్రయత్నించిన షాట్ ఎంతో చెత్తదైంది’’ అని జేమ్సన్ పేర్కొన్నాడు. అంతేకాదు.. థామస్ చెత్త జోకులూ వేసేవాడని, అతని కారణంగా కోచ్ సైతం ఇబ్బందులు పడేవారని చెప్పాడు. అయితే.. పాఠశాలలో ఉన్నప్పుడు థామస్ తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడని వెల్లడించాడు. అతడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడని, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడని అన్నాడు. కానీ.. ఏనాడూ అతను రాజకీయాల గురించి గానీ, ట్రంప్‌ గురించి గానీ మాట్లాడటం తాను వినలేదని జేమ్సన్ స్పష్టం చేశాడు.


యాడ్ తొలగింపు

ఇదిలావుండగా.. ‘బ్లాక్ రాక్’ అనే అతిపెద్ద మనీ మేనేజింగ్ సంస్థ 2022లో ఒక యాడ్‌ రూపొందించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌ హైస్కూల్‌లో దాన్ని షూట్‌ చేయడం జరిగింది. అందులో ఆ స్కూల్‌కి చెందిన కొందరు విద్యార్థులు నటించారు. వారిలో థామస్ కూడా ఉన్నాడు. ఇప్పుడు అతడు ట్రంప్‌పై కాల్పులు జరిపిన తరుణంలో.. ఆ యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో విమర్శలు ఎదురవ్వడంతో.. ఆ కంపెనీ సదరు ప్రకటనను తమ వెబ్‌సైట్‌ నుంచి తొలగించింది. అయితే.. అధికారుల కోసం ఆ వీడియో అందుబాటులో ఉంటుందని బ్లాక్ రాక్ స్పష్టం చేసింది.

Read Latest International News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 03:39 PM

Advertising
Advertising
<