USA election Results: అమెరికా ఎన్నికల ఫలితాలు.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ కీలక సూచన
ABN, Publish Date - Nov 06 , 2024 | 02:48 AM
అమెరికా ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ప్రజలకు గూగుల్ విశ్వసనీయ సమాచార కేంద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిలషించారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఎన్నికల్లో ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ఎన్నికల ఫలితం ఎలా ఉన్నా ప్రజలకు గూగుల్ విశ్వసనీయ సమాచార కేంద్రంగా ఉండాలని అభిలషించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు లేఖ రాసినట్టు ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు బడా కార్పొరేట్ సంస్థల ప్రయత్నాలకు పిచాయ్ ప్రకటన అద్దం పడుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Donald Trump: అలా అయితేనే నేను ఓటమిని ఒప్పుకుంటా: డొనాల్డ్ ట్రంప్
తాను అధికారంలోకి వస్తే గూగుల్‌పై దర్యాప్తు ప్రారంభిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఈ సెప్టెంబర్‌లో హెచ్చరించారు. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో తన గురించి ఎప్పుడూ చెత్త కథనాలే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ‘‘నాకు సంబంధించిన చెత్త కథనాలు, కమలా హ్యారిస్‌కు సంబంధించిన మంచి కథనాలు సెర్చ్ ఫలితాల్లో కనిపించేలా గూగుల్ ప్రయత్నించినట్టు తెలిసింది’’ అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూస్ సోషల్‌లో ఇటీవల పోస్టు పెట్టారు. ఇది చట్టవ్యతిరేక చర్యగా పేర్కొన్న ట్రంప్, ఎన్నికల్లో ఇలా అక్రమంగా జోక్యం చేసుకున్నందుకు న్యాయశాఖ.. బాధ్యులపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించాలని అన్నారు. 2019లో కూడా ట్రంప్ ఇదే తరహా ఆరోపణలు చేశారు. 2016 నాటి ఎన్నికల సందర్భంగా తనపై ప్రతికూల వార్తాకథనాలను హైలైట్ చేసేందుకు గూగుల్ ప్రయత్నించిందని ఆరోపించారు.
For International News And Telugu News
Updated Date - Nov 06 , 2024 | 02:52 AM