Sydney: సిడ్నీ చర్చిలో కత్తితో యువకుడి దాడి, పలువురికి గాయాలు.. మూడు రోజుల్లో రెండో ఘటన
ABN, Publish Date - Apr 15 , 2024 | 05:54 PM
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సోమవారంనాడు మరో ఘాతుకం చోటుచేసుకుంది. సిడ్నీ చర్చిలో ఓ యువకుడు బిషప్‌పై కత్తితో దాడి చేశాడు. అగంతకుడిని పట్టుకునే క్రమంలో పలువురు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ (Sidney)లో మరో ఘాతుకం చోటుచేసుకుంది. సిడ్నీ చర్చి (Church)లో ఓ యువకుడు బిషప్‌పై కత్తితో దాడి చేశాడు. అగంతకుడిని పట్టుకునే క్రమంలో పలువురు గాయపడ్డారు. దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. క్షతగ్రాతులకు పారామెడికల్ సిబ్బంది తక్షణ చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. సిడ్నీ నగరంలో కత్తితో దాడి ఘటనలు చేసుకోవడం గత మూడు రోజుల్లో ఇది రెండవది.
Sydney mall stabbing: షాపింగ్ మాల్‌లో కలకలం, దండగుడి దాడిలో ఐదుగురు దుర్మరణం
స్థానిక మీడియా కథనం ప్రకారం, క్రిస్ట్ ది గుడ్ షెప్పర్డ్ చర్చిలో బిషఫ్ ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్ సేవలు అందిస్తున్న సమయంలో దాడి జరిగింది. బిషప్‌ను సమీపించిన యువకుడు అకస్మాత్తుగా ఆయనపై కత్తితో విరుచుకుపడ్డాడు. దీంంతో పలువురు భయభ్రాంతులు కాగా, మరికొందరు యువకుడిని అడ్డుకోవడంతో ముగ్గురు గాయడ్డారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సంచలనవుతోంంది. సిడ్నిలోని బాండి ప్రాంతంలో గత శనివారంనాడు ఒక షాపింగ్ మాల్‌లో ఓ దుండగుడు కత్తితో విరుచుకుపడటంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 15 , 2024 | 05:57 PM