ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Climate Agency: 2024 ఏడాది గురించి క్లైమేట్ ఏజెన్సీ సంచలన ప్రకటన

ABN, Publish Date - Sep 07 , 2024 | 03:57 PM

మానవాళి చరిత్రలోనే ఈ ఏడాది అత్యంత వేడిగా ఉన్న సంవత్సరమని యూరోపియన్ క్లైమేట్ ఏజెన్సీ అంచనా వేసింది. 2024 వేసవి కాలం భూమిపై అత్యంత వేడిగా ఉందని క్లైమేట్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ క్రమంలో ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

European Climate Agency

ఐరోపా వాతావరణ సంస్థ(European Climate Agency) కోపర్నికస్ ఈ వేసవిలో భూమి ఉష్ణోగ్రత అత్యధికంగా ఉందని అంచనా వేసింది. అంతేకాదు మానవాళి చరిత్రలో ఈ సంవత్సరం అత్యంత వేడిగా(hottest year) ఉన్న సంవత్సరం అని ఏజెన్సీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2024 వేసవిలో భూమి అత్యంత వేడిగా ఉందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ వెల్లడించింది. వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావం వంటి అంశాల కారణంగా ఈ రికార్డు స్థాయి వేడి ఏర్పడిందని శాస్త్రవేత్తలు అన్నారు.


గతేడాది కంటే ఈసారి

కోపర్నికస్ ప్రకారం జూన్, జులై, ఆగస్టులలో సగటు ఉష్ణోగ్రత 16.8 °C (62.24 °F). ఇది మునుపటి 2023 రికార్డు కంటే 0.03 డిగ్రీల సెల్సియస్ (0.05 డిగ్రీల ఫారెన్‌హీట్) ఎక్కువగా ఉంది. కోపర్నికన్ రికార్డులు 1940 నాటివి. 19వ శతాబ్దం మధ్యలో ప్రారంభమయ్యే అమెరికన్, బ్రిటీష్ జపనీస్ రికార్డులు గత దశాబ్దం సగటు ఉష్ణోగ్రతల కంటే ఇవి వెచ్చగా ఉన్నాయని చెబుతున్నాయి. గత 1,20,000 సంవత్సరాలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


ఎక్కువగా నమోదు

2024, 2023 సంవత్సరాల్లోని ఆగస్టు నెలలో సగటు ఉష్ణోగ్రత 16.82 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది ప్రపంచ ఉష్ణోగ్రతకు సమానమని కోపర్నికస్ డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో తెలిపారు. వాతావరణ మార్పులు మనపై ఎలా పట్టు బిగిస్తున్నాయో ఈ డేటా తెలియజేస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ముందు మునుపటి సంవత్సరం 2023 కూడా సగటున చాలా వేడిగా ఉంది. ఆ క్రమంలో 2023 భూమిపై అత్యంత వేడిగా ఉంటుందా అనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు 2024 డేటా బయటకు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఎలా ఉంటుందోనని భయాందోళన మొదలైంది.


మరోవైపు

ఈ నేపథ్యంలోనే భూమిపై అత్యంత వేడిగా ఉండే సంవత్సరం ప్రస్తుతానికి ఇదేనని అంటున్నారు. అమెరికాలోని అరిజోనాలో ఈ సంవత్సరం 100 రోజులకు పైగా ఉష్ణోగ్రత 37.8 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉందని వాతావరణ శాస్త్రవేత్త జోనాథన్ ఓవర్‌ప్యాక్ అన్నారు. వేడిగాలులు, భారీ వర్షాలు, వరదలు వంటి సంఘటనలు కూడా భారీగా పెరిగాయని అన్నారు. వాతావరణ మార్పులను విస్మరించడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Kamala Harris: డొనాల్డ్ ట్రంప్‌ను బీట్ చేసిన కమలా హారిస్.. ఆగస్టు విరాళాలలో

Ganesh Chaturthi: ముంబైలో లాల్‌బాగ్చా రాజా గణపతికి ఉద్ధవ్ పూజలు


Read MoreInternational News and Latest Telugu News

Updated Date - Sep 07 , 2024 | 04:03 PM

Advertising
Advertising