USA: ఇన్సూరెన్స్ కంపెనీ సీఈఓ హత్య.. వణికిపోతున్న కార్పొరేట్ అమెరికా!
ABN, Publish Date - Dec 12 , 2024 | 10:49 PM
అమెరికా ఇన్సూరెన్స్ సంస్థ యూనైటెడ్ హెల్త్‌కేర్ సీఈఓ బ్రయన్ థామ్సన్ హత్యతో కార్పొరేట్ అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజంలో పెరుగుతున్న ధనిక పేద అంతరాలు, కార్పొరేట్ కంపెనీల దురాశతో ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం మరిన్ని దాడులకు దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ఇన్సూరెన్స్ సంస్థ యూనైటెడ్ హెల్త్‌కేర్ సీఈఓ బ్రయన్ థామ్సన్ హత్యతో కార్పొరేట్ అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాజంలో పెరుగుతున్న ధనిక పేద అంతరాలు, కార్పొరేట్ కంపెనీల దురాశతో ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహం మరిన్ని దాడులకు దారి తీసే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీ తన ఉన్నతోద్యోగుల రక్షణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లకు సిద్ధమైయ్యాయి. వారి భద్రతను పెంచేందుకు సెక్యూరిటీ సంస్థలను ఆశ్రయిస్తున్నాయి (USA).
Citizenship Rights : పుట్టుకతో పౌరసత్వ హక్కును రద్దు చేస్తా
తమ సీఈఓలకు సెక్యూరిటీ కల్పించాలంటూ రెండు రోజుల వ్యవధిలో ఏకంగా 70 సంస్థలు తమను సంప్రదించాయని ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇప్పటికే అనేక కంపెనీలు తమ ఉన్నతాధికారుల వ్యక్తిగత వివరాలు, ప్రొఫైల్స్, ఫొటోలను వెబ్‌సైట్‌ల నుంచి తొలగించాయి. వారి సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను డిలీట్ చేయడం ప్రారంభించాయి. ఉన్నతాధికారుల ఆఫీసులను మూసేయడం, వారితో వ్యక్తిగత మీటింగులను రద్దు చేయడం వంటి చర్యలు చేపట్టాయి. బ్రయన్ థామ్సన్ హత్య కార్పొరేట్ ప్రపంచంలో శాశ్వత మార్పులకు దారి తీసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
Viral: రహదారిపై క్రాష్ ల్యాండింగ్.. రెండు ముక్కలైన విమానం!
‘ఈరోజు ఇన్సూరెన్స్ రంగాన్ని టార్గెట్ చేశారు. నెక్ట్స్ ఎవరో అన్న భయం కార్పొరేట్ అమెరికాను వెంటాడుతోందని ఓ ఆర్థిక కన్సల్టెన్సీ సంస్థ పేర్కొంది. కాగా, అమెరికాలో హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ రంగంపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహానికి బ్రయన్ థామ్సన్ హత్య ఓ సంకేతమని న్యూయార్క్ పోలీసులు భావిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల దురాశపై ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం ఇంధనంగా, ఈ హత్య స్ఫూర్తితో మరింత హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. హంతుకుడికి పెరుగుతున్న మద్దతును కూడా ఇందుకు ఆధారంగా చూపుతున్నారు.
Donald Trump : డాలర్‌తో పెట్టుకుంటే.. టాటా చెప్పాల్సిందే!
అమెరికాలో ఇన్సూరెన్స్ రంగం లోపభూయిష్టమైందంటూ, కార్పొరేట్ కంపెనీల దురాశపై ఆగ్రహంతో ఊగిపోయిన లూయిగీ మాంజియానీ.. యూనైటెడ్ హెల్త్ సీఈను పట్టపగలు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. స్వయంగా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన లూయిగీ ఓ కార్పొరేట్ కంపెనీ సీఈఓపై ఇంతగా ఆగ్రహం పెంచుకోవడం ప్రస్తుతం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
Read Latest and International News
Updated Date - Dec 12 , 2024 | 10:49 PM