ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్కూటర్‌ బాంబుతో రష్యా టాప్‌ జనరల్‌ హత్య

ABN, Publish Date - Dec 18 , 2024 | 03:36 AM

రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం జరిగిన స్కూటర్‌ బాంబు పేలుడు ఘటనలో ఆ దేశ టాప్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌, ఆయన సహాయకుడు మరణించారు.

మాస్కో/న్యూఢిల్లీ, డిసెంబరు 17: రష్యా రాజధాని మాస్కోలో మంగళవారం జరిగిన స్కూటర్‌ బాంబు పేలుడు ఘటనలో ఆ దేశ టాప్‌ జనరల్‌ ఇగోర్‌ కిరిల్లోవ్‌, ఆయన సహాయకుడు మరణించారు. కిరిల్లోవ్‌ ప్రసుత్తం రష్యా అణు, జీవ, రసాయన రక్షణ బలగాల(ఎన్‌బీసీ) అధిపతిగా ఉన్నారు. తమ దేశంపైకి రసాయన ఆయుధాల ప్రయోగానికి ఆయన అనుమతి ఇచ్చారని ఉక్రెయిన్‌ ఆరోపించిన తర్వాతి రోజునే కిరిల్లోవ్‌ హత్య జరగడం చర్చనీయాంశంగా మారింది. స్కూటర్‌లో పేలుడు పదార్థాలను అమర్చి, కిరిల్లోవ్‌ తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో దాడికి పాల్పడ్డారని రష్యా ఫెడరల్‌ దర్యాప్తు సంస్థ పేర్కొంది. కాగా, ఉక్రెయిన్‌ అంతర్గత భద్రతా విభాగమే (ఎస్‌బీయూ) ఈ దాడి చేసిందని ఆ ఏజెన్సీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. కిరిల్లోవ్‌ ఒక యుద్ధ నేరస్తుడన్నారు.

Updated Date - Dec 18 , 2024 | 04:24 AM