Georgia: విషవాయువు విడుదలై జార్జియా హోటల్‌లో 12 మంది భారతీయులు మృతి
ABN, Publish Date - Dec 16 , 2024 | 09:52 PM
విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.
టిబిలీసి: జార్జియా(Georgia)లోని ఇండియన్ రెస్టారెంట్ గుడౌరి మౌంటెయిన్ రిసార్ట్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. రిసార్ట్ రెండో అంతస్తులోని బెడ్‌రూమ్‌లో 12 మంది భారతీయులు మృతి చెందినట్టు కనుగొన్నారు. రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వీరంతా కార్బన్ మోనోక్సైడ్ విషవాయువు పీల్చడం కారణంగా మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో గమనించామని, మరింత లోతుగా విశ్లేషిస్తు్న్నామని జార్జియా అంతర్జాతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.
"జార్జియాలోని గుడౌరిలో 12 మది భారతీయులు మృతిచెందినట్టు ఇప్పుడే సమాచారం అందింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన భారతీయుల గురించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాం'' అని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, పవర్ జనరేటర్ నుంచి కార్బన్ మోనోక్సైడ్ విడుదలైనట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇతమిత్ధమైన కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు కూడా చేపట్టినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. జార్జియా క్రిమినల్ కోడ్ 116 కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - Dec 16 , 2024 | 09:57 PM