UK : యూకేలో జంక్‌ఫుడ్‌పై టీవీ ప్రకటనలు బంద్!
ABN, Publish Date - Dec 06 , 2024 | 05:13 AM
ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశంలో రోజురోజుకి అధికమవుతున్న వేళ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్‌గా పరిగణించే పిజ్జా, బర్గర్, పేస్ట్రీ, వాఫీ, ప్యాన్ కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ తదితర ఆహార పదార్థాలు, శీతలపానీయాల ప్రకటనలను టీవీల్లో
లండన్, డిసెంబరు 5: ఊబకాయంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశంలో రోజురోజుకి అధికమవుతున్న వేళ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జంక్ ఫుడ్‌గా పరిగణించే పిజ్జా, బర్గర్, పేస్ట్రీ, వాఫీ, ప్యాన్ కేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ తదితర ఆహార పదార్థాలు, శీతలపానీయాల ప్రకటనలను టీవీల్లో పగటి పూట ప్రసారం చేయడంపై నిషేధం విధించింది. ఆయా ప్రకటనలను రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ప్రసారం చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది అక్టోబరు నుంచి ఈ ఆంక్షలను అమలు చేయనుంది. అయితే, ఈ నిషేధం కేవలం జంక్ ఫుడ్‌పై మాత్రమే కానీ ఆహారాన్ని సరఫరా చేసే రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలకు వర్తించదు. ఆయా ప్రకటనలను పిల్లలు చూడకుండా చెయ్యడంవల్ల వారిని జంక్ ఫుడ్‌కు కాస్త దూరం చెయ్యవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.
Updated Date - Dec 06 , 2024 | 05:13 AM