ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UK: దీపావళి విందులో మాంసాహారం.. బ్రిటన్ ప్రధాని కార్యాలయం క్షమాపణలు

ABN, Publish Date - Nov 15 , 2024 | 06:44 PM

బ్రిటన్ ప్రధాని కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో అపశ‌ృతి దొర్లడంపై అక్కడి ప్రభుత్వం తాజాగా క్షమాపణలు చెప్పింది.

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్ (Britain) ప్రధాని కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన దీపావళి వేడుకల్లో అపశ‌ృతి దొర్లడంపై అక్కడి ప్రభుత్వం తాజాగా క్షమాపణలు చెప్పింది. వేడుకల్లో మాంసాహారంతో పాటు మద్యం కూడా అందుబాటులో ఉండటంపై అక్కడి హిందూ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రధాని కార్యాలయం శుక్రవారం క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో మంసాహారం ప్రస్తావన నేరుగా చేర్చనప్పటికీ.. జరిగిన పొరపాట్లతో స్థానిక హిందూ వర్గాల మనోభావాలు దెబ్బతిన్న విషయాన్ని అంగీకరించింది. భవిష్యత్తు కార్యక్రమాల్లో పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ‘‘ఈ ఘటనతో పలువురి మనోభావాలు దెబ్బతిన్నందుకు చింతిస్తున్నాం. భవిష్యత్తులో ఎలాంటి పొరపాట్లు జరగవని హామీ ఇస్తున్నాం’’ అని ప్రధాని కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు.

Viral: ఫ్రీగా పనిచేస్తా.. ఒక్క జాబ్ ప్లీజ్! యూకేలో భారతీయ యువతి వేడుకోలు


ఈ అపశృతిపై అంతకుమునుపు భారత సంతతి హిందూ ఎంపీ శివానీ రాజా తీవ్రంగా స్పందించారు. దీపావళిని పురస్కరించుకుని ఈసారి ఏర్పాటు చేసిన విందు హిందూ సంప్రదాయాలకు అనుగూణంగా లేదని ప్రధాని స్టార్మర్‌కు లేఖ రాశారు. హిందూ విశ్వాసాలు, ఆచారాలపై అవగాహన లేకుండా కార్యాక్రమాన్ని నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనేక మంది స్థానిక హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా తనకు బ్రిటన్ అత్యున్నత కార్యాలయంలో వేడుకలు సరైన నిర్వహణకు నోచుకోకపోవడంం విచారం కలిగించిందని అన్నారు. భవిష్యత్తులో జరిగే వేడుకల కోసం తన సూచనలు సలహాలు ఇచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.

Viral: ఫ్రీగా పనిచేస్తా.. ఒక్క జాబ్ ప్లీజ్! యూకేలో భారతీయ యువతి వేడుకోలు


ఇటీవలే అధికారంలోకి వచ్చిన లేబర్ పార్టీ ప్రభుత్వం అక్టోబర్ 29న అధికారికంగా దీపావళి వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు భారత సంతతి ఎంపీలు, వృత్తినిపుణులు, హిందూ వర్గాల నేతలు హాజరయ్యారు. అయితే, ఈ కార్యక్రమంలో సాంస్కృతిపరమైన పొరపాట్లపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీపావళి పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతపై ప్రభుత్వంలో అవగాహన లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, గతంలో రిషి సునాక్ తరహాలోనే స్టార్మర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన స్వయంగా దీపాలను తెచ్చి కార్యాలయం గడప వద్ద పెట్టారు.

king charles 3: భారత్‌లో కింగ్ ఛార్లెస్ దంపతుల పర్యటన.. అంతా టాప్ సీక్రెట్‌

For Nationan News And Telugu News

Updated Date - Nov 15 , 2024 | 06:56 PM