మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Father: తండ్రి కాదు కసాయి.. ఆరేళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?

ABN, Publish Date - May 02 , 2024 | 02:57 PM

క్రిస్టోఫర్ జార్జ్ అనే వ్యక్తి తన కుమారుడు అయిన కోరెను టార్చర్ చేశాడు. ఆ చిన్నారికి ఒంట్లో కొవ్వు ఉందని థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు. పాపం ఆరేళ్ల బాలుడు బాలుడు ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వదల్లేదు. తల పైన కొరికి మరి థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు.

Father: తండ్రి కాదు కసాయి.. ఆరేళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?
US Man

కొందరి పిచ్చి పీక్‌కు చేరిన సమయంలో ఏం చేస్తారో తెలియదు. అచ్చం ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారు. అమెరికాలో ఓ వ్యక్తి ఇలానే చేశాడు. తన కుమారుడు లావుగా ఉన్నాడని పిచ్చిగా ప్రవర్తించాడు. థ్రెడ్ మిల్ మీద పరుగెత్తించాడు. పాపం ఆ పిల్లాడు పరుగెత్తి, పరుగెత్తి అలసిపోయాడు. కిందపడిపోయిన వదల్లేదు.


క్రిస్టోఫర్ జార్జ్ అనే వ్యక్తి తన కుమారుడు అయిన కోరెను టార్చర్ చేశాడు. ఆ చిన్నారికి ఒంట్లో కొవ్వు ఉందని థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు. పాపం ఆరేళ్ల బాలుడు బాలుడు ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వదల్లేదు. తల పైన కొరికి మరి థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు. 2021 జూలై నెలలో ఘటన జరిగింది. ఆ తర్వాత బాలుడు చనిపోయాడు. విచారణ క్రమంలో జిమ్‌లో థ్రెడ్ మిల్ చేసే ఫుటేజీ బయటకు వచ్చింది. ఆ వీడియో చూసి బాలుడి తల్లి బ్రెన్నా మికియోలో కంట తడి పెట్టింది.


2021 జూలైలో కుమారుడు గాయపడిన తర్వాత అతడిని న్యూజెర్సీ‌లో గల చైల్డ్ ప్రొటెక్షన్‌ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ థ్రెడ్ మిల్ వద్ద జరిగిన ఘటన గురించి ఆ బాలుడు తల్లికి వివరించాడు. తనతో తండ్రి ప్రవర్తించిన తీరును పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆ మరుసటి రోజు పిల్లాడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆలస్యమైంది. కోరె లేచినప్పటికీ సరిగ్గా మాట్లాడటం లేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. సీటీ స్కాన్ తీయగా.. మూర్చతో బాధ పడ్డారని తేలింది.


కోరెకు వెంటనే ట్రీట్ మెంట్ అందించినప్పటికీ ఫలిత లేదు. తీవ్ర గాయాలు, గుండె, లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కోరె తండ్రి క్రిస్టోఫర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణ సమయంలో ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసి కన్న తల్లి తల్లడిల్లింది. కేసులో ఆమె సాక్షిగా ఉన్నారు. కేసు విచారణ జరుగుతుంది. నేరం రుజువైతే క్రిస్టోఫర్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.


Read Latest
International News and Telugu News

Updated Date - May 02 , 2024 | 02:57 PM

Advertising
Advertising