ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లెబనాన్‌కు భారత్‌ మానవతా సాయం

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:22 AM

ఇజ్రాయెల్‌-హెజ్బొల్లాల మధ్య దాడులతో సతమతమవుతోన్న లెబనాన్‌ ప్రజలకు భారత్‌ మానవతా సాయం అందించింది.

  • 33 టన్నుల అత్యవసర మందుల సరఫరా

న్యూఢిల్లీ, అక్టోబరు 18 : ఇజ్రాయెల్‌-హెజ్బొల్లాల మధ్య దాడులతో సతమతమవుతోన్న లెబనాన్‌ ప్రజలకు భారత్‌ మానవతా సాయం అందించింది. ఆ దేశానికి 33 టన్నుల అత్యవసర మందులను అందించేందుకు నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం 11 టన్నుల మందులను పంపినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రాణాలను కాపాడే అత్యవసర ఔషధాలు ఇందులో ఉన్నాయి. హృద్రోగాలకు సంబంధించిన మందులు, యాంటీబయోటిక్స్‌, అనెస్తటిక్స్‌, యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందులను ఆ దేశానికి పంపారు. మరిన్ని ఔషధాలను కూడా పంపనున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ దేశానికి అత్యవసర మందుల కొరతను ఇవి కొంతమేర తీర్చుతాయని అంచనా. మరికొన్ని వారాల్లో మిగిలిన మందులను పంపనున్నట్లు తెలిపింది.

Updated Date - Oct 19 , 2024 | 03:24 AM