ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రోజుకు రూ.100 కోట్లు

ABN, Publish Date - Apr 16 , 2024 | 03:35 AM

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు, నగ దు, డ్రగ్స్‌, మద్యం ఏరులై పారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృం దాలు

ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న సొత్తు

44 రోజుల్లో 4,658 కోట్ల విలువైన

సొత్తు సీజ్‌.. దేశ చరిత్రలో ఇదే రికార్డు

మత్తుపదార్థాల విలువే రూ.2,068 కోట్లు

రాజస్థాన్‌లో అత్యధికంగా 778 కోట్లు

వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఎన్నికల తనిఖీల్లో 45 రోజుల్లో 4,658 కోట్ల నగదు, డ్రగ్స్‌, ఇతర వస్తువులు సీజ్‌

దేశ చరిత్రలో ఇదే రికార్డు స్థాయి మొత్తం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌15 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తాయిలాలు, నగ దు, డ్రగ్స్‌, మద్యం ఏరులై పారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల అధికారులు/ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృం దాలు జరిపిన దాడులు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీల్లో మార్చి1 నుంచి శనివారం వరకు రికార్డుస్థాయిలో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు సీజ్‌ అయ్యింది. గడిచిన 45రోజుల్లో రోజుకు సగటున రూ.100కోట్లకుపైగా సొత్తు పట్టుబడింది. 2019సార్వత్రిక ఎన్నికలప్పుడు సీజ్‌ అయిన మొత్తం సొత్తు రూ.3,475 కోట్లుగా ఉం ది. భారత ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) సోమవారం ఈ వివరాలు వెల్లడించింది. పట్టుబడ్డ నగదు, బంగారం, ఆభరణాలు, సామగ్రి విషయంలో.. కేవలం ఎన్నికల పంపిణీలు అనికాకుండా.. లెక్కపత్రాలులేకుండా తీసుకువెళ్లేవి కూడా ఉన్నాయి. ఎన్నికల క్రతువు ముగిసేసరికి ఈసారి మరిం త నగదు, తాయిలాలు, డ్రగ్స్‌, మద్యం సీజయ్యే అవకాశాలున్నట్లు ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు సహకరించినట్లు ఆరోపణలు వచ్చిన 106 మంది ప్రభుత్వోద్యోగులపై ఈసీ చర్యలు తీసుకుంది. కాగా ఇప్పటి వరకు సీజ్‌ అయిన మొత్తం సొత్తులో 45ు (రూ.2,068 కోట్లు) మాదకద్రవ్యాలు కావ డం గమనార్హం..! ఇందులో రూ.485కోట్లు డ్రగ్స్‌ గుజరాత్‌లో పట్టుబడ్డాయి. రూ.293 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ అయిన తమిళనా డు రెండోస్థానంలో ఉంది. మొత్తం సొత్తు లో నగదు రూ.395.39 కోట్లు కాగా.. మద్యం విలువ రూ.489.31 కోట్లు, విలువైన వస్తువులు (రూ. 562.10 కోట్లు), తాయిలాలు (1,142.49 కోట్లు) ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇప్పటివరకు సీజ్‌ అయిన రూ.4,658 కోట్లలో అత్యధికంగా రూ.778కోట్ల సొత్తు రాజస్థాన్‌లో పట్టుబడింది. ఈ జాబితాలో ఏపీ (రూ.125.97కోట్లు) 12వ, తెలంగాణ (రూ.121.84కోట్లు)13వ స్థానంలో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

ఏపీలో సీజ్‌ చేసిన మొ త్తం సొత్తు(రూ.125.97 కోట్లు)లో నగదు రూ.32.15 కోట్లు.. మద్యం రూ.19.71 కోట్లు, మత్తుపదార్థాలు రూ.4 కోట్లు, విలువైన వస్తువులు రూ.57.14 కోట్లు, తాయిలాలు రూ.12.89 కోట్లున్నట్లు ఈసీ పేర్కొంది. తెలంగాణలో సీజ్‌ అయిన సొత్తు (రూ.121.84కోట్లు)లో నగదు రూ.49.18 కోట్లు, మద్యం రూ.19.21కోట్లు, డ్రగ్స్‌ రూ.22.71 కోట్లున్నాయి.

Updated Date - Apr 16 , 2024 | 03:35 AM

Advertising
Advertising