ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మళ్లీ రగిలిన మణిపూర్‌

ABN, Publish Date - Nov 12 , 2024 | 03:25 AM

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సోమవారం భద్రతాదళాలు, కుకీ మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతమయ్యారు.

  • 11 మంది కుకీల హతం

  • భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు

  • పోలీస్‌స్టేషన్‌పై దాడులు.. దుకాణాలకు నిప్పు

  • మణిపూర్‌లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతం

ఇంఫాల్‌, నవంబరు 11: మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సోమవారం భద్రతాదళాలు, కుకీ మిలిటెంట్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది కుకీ మిలిటెంట్ల హతమయ్యారు. తొలుత బోరోబెక్రా పోలీసుస్టేషన్‌పై కుకీ మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. అనంతరం సమీపంలోని జకురాడొర్‌ కరోంగ్‌ గ్రామానికి వెళ్లి బీభత్సం సృష్టించారు. అనేక దుకాణాలకు నిప్పుపెట్టారు. దరిమిలా భద్రతాదళాలు- కుకీ మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది కుకీ మిలిటెంట్లు హతమైనట్లు అధికారులు తెలిపారు. కొంతమంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కూడా గాయపడ్డారని వారు వెల్లడించారు. మరోవైపు ఆదివారం మైతేయి గ్రామాలపైన కుకీ ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. జిరిబామ్‌ జిల్లాలోని థమ్నాపోక్పీ, సబున్‌కోక్‌, సనసాబి గ్రామాలకు సమీపంలోని కొండలపై నుంచి తుపాకులు, బాంబులతో దాడులకు పాల్పడ్డారు. పంటకోత కాలం కావడంతో పొలాల్లో పనిచేసుకుంటున్న తమవారిని లక్ష్యంగా చేసుకుని కుకీ వర్గాలు దాడులకు పాల్పడ్డాయని మైతేయిలు ఆరోపించారు. బీఎ్‌సఎఫ్‌ జవాన్లు రావడంతో వారు దాడులను నిలిపివేశారని లేదంటే భారీ నష్టం జరిగేదని అన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 03:27 AM