ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

9 నెలల్లో రూ.11,333 కోట్లు దోపిడీ

ABN, Publish Date - Nov 29 , 2024 | 05:00 AM

ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలో నెలకు సగటున లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి

దేశంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలు

నెలకు సగటున లక్షకు పైగా ఫిర్యాదులు: నివేదిక

న్యూఢిల్లీ, నవంబరు 28: ఇటీవలి కాలంలో సైబర్‌ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. మన దేశంలో నెలకు సగటున లక్షకు పైగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు వరకు 9 నెలల్లో సైబర్‌ స్కామ్‌ల్లో బాధితులు దాదాపు రూ.11,333 కోట్లు నష్టపోయినట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత సైబర్‌ క్రైమ్‌ కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ (14సీ) విభాగం డేటాను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ నివేదికను ప్రచురించింది. ఈ జాబితాలో స్టాక్‌ ట్రేడింగ్‌ మోసాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో పెట్టుబడుల పేరిట మోసాలకు సంబంధించి లక్ష ఫిర్యాదులు (రూ.3,216 కోట్లు), డిజిటల్‌ అరెస్ట్‌ కేసులకు సంబంధించి 63 వేల ఫిర్యాదులు (రూ.1,616 కోట్లు) ఉన్నాయి. కాగా ది సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎ్‌ఫసీఎ్‌ఫఆర్‌ఎంఎస్‌) డేటా ప్రకారం ఈ ఏడాది 12 లక్షల ఫిర్యాదులు అందినట్టు పేర్కొంది. ఇందులో 45ు కంబోడియా, మయన్మార్‌, లావో్‌సకు సంబంధించినవి ఉన్నాయి. 2021 నుంచి సైబర్‌ మోసాలకు సంబంధించి రూ.27,914 కోట్లు నష్టపోయినట్టు సీఎ్‌ఫసీఎ్‌ఫఆర్‌ఎంఎ్‌సకు దాదాపు 30.05 లక్షల ఫిర్యాదులు అందాయి.

Updated Date - Nov 29 , 2024 | 05:00 AM