ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bus Accident: హిమాచల్‌లో ఘోరం.. భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. 21 మంది..

ABN, Publish Date - Apr 12 , 2024 | 08:51 PM

హరియాణాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరవకముందే.. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది.

సిమ్లా: హరియాణాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరవకముందే.. హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం జరగ్గా.. ప్రమాద సమయంలో అందులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 52 మందితో వెళ్తున్న ఓ బస్సు కాంగ్రా టన్నెల్ సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్పీజీఎంసీ తండాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


బస్సును సీజ్ చేశామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కాంగ్రా షాలిని అగ్ని హోత్రి చెప్పారు. హరియాణాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతి చెందారు. 15 మందికిపైగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గత వారం ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారి 44పై మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా వద్ద బాలాజీ ఆలయానికి వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడడంతో 30 మంది గాయపడ్డారు.

BJP: కుల గణనకు బీజేపీ వ్యతిరేకమా.. జేపీ నడ్డా ఏమన్నారంటే

2023లో..

కశ్మీర్‌లో 2023 నవంబర్‌లో కూడా బస్సు ప్రమాదం జరిగింది. డోడా జిల్లాలో బటోత్ – కిష్త్వాడ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 08:52 PM

Advertising
Advertising