ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

24 గంటలు.. మూడు బ్రిడ్జిలు

ABN, Publish Date - Jul 05 , 2024 | 01:13 AM

బిహార్‌లో బ్రిడ్జిలు కూలిపోయే పరంపర కొనసాగుతోంది. ఒక్క సరన్‌ జిల్లాలోనే 24 గంటల్లో మూడో వారధి పడిపోయింది.

బిహార్‌ సరన్‌ జిల్లాలో కూలిన మరో వారధి

పట్నా, జూలై 4: బిహార్‌లో బ్రిడ్జిలు కూలిపోయే పరంపర కొనసాగుతోంది. ఒక్క సరన్‌ జిల్లాలోనే 24 గంటల్లో మూడో వారధి పడిపోయింది. ఆ రాష్ట్రంలో 17 రోజుల్లో ఇది 12వ ఘటన. సరన్‌లోని బనియాపూర్‌ బ్లాక్‌లో పదిహేనేళ్ల క్రితం నిర్మించిన చిన్న బ్రిడ్జి గురువారం కూలిపోయింది. గండకీ నదిపై కట్టిన ఈ వారధి సరన్‌లోని పలు గ్రామాలు, పొరుగునున్న సివాన్‌ జిల్లాలోని ఊళ్లను కలుపుతుంది. తాజా ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని, ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీని వేశామని సరన్‌ కలెక్టర్‌ అమన్‌ సమిర్‌ తెలిపారు. సరన్‌ జిల్లాలో దీనికిముందు జనతా బజార్‌, లహ్లాద్‌ పూర్‌ ఏరియాల్లో రెండు చిన్న బ్రిడ్జిలు పడిపోయాయి. ఈ జిల్లాలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రిడ్జిలు కూలడానికి ఇదీ ఓ కారణమని స్థానికులు చెబుతున్నారు. మధుబని, అరారియా, తూర్పు చంపారన్‌, కిషన్‌గంజ్‌ జిల్లాల్లోనూ ఇటీవలికాలంలో పది వారధులు కూలాయి. రాష్ట్రంలోని అన్ని పాత బ్రిడ్జిల పరిస్థితిపై ప్రభుత్వం సమీక్షకు ఆదేశించింది. ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే వారధులు కూలుతున్నాయని బిహార్‌ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ (జల వనరులు) తెలిపారు. గండకీ నదిపై సివాన్‌, సరన్‌ జిల్లాల్లోనే బుధ, గురువారాల్లో 6 వంతెనలు పడిపోయాయన్నారు. వీటిలో చాలావరకు 30ఏళ్ల కింద నిర్మించినవి, పునాదులు లోతుగాలేవని చెప్పారు. కాగా వరుస ఘటనల నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా సూచించాలని న్యాయవాది బ్రజేశ్‌ సింగ్‌ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దేశంలోనే అత్యంత వరద ప్రభావిత రాష్ట్రం బిహార్‌ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 01:13 AM

Advertising
Advertising