ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:54 AM

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కల్పించాలనే ప్రతిపాదన కర్ణాటకలో వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే వక్ఫ్‌ భూముల అంశం ప్రభుత్వానికి తీరని చెడ్డపేరు వచ్చింది. మూడు నాలుగు తరాలుగా సాగు

ప్రతిపాదన మాత్రమే: కర్ణాటక సీఎంవో

బెంగళూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కల్పించాలనే ప్రతిపాదన కర్ణాటకలో వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే వక్ఫ్‌ భూముల అంశం ప్రభుత్వానికి తీరని చెడ్డపేరు వచ్చింది. మూడు నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్‌కు చెందినదంటూ రైతులకు నోటీసులు ఇవ్వడంతో రాష్ట్రమంతటా ఆందోళనకు కారణమైంది. తాజాగా కాంట్రాక్టు పనుల్లో నాలుగుశాతం రిజర్వేషన్‌ ముస్లింలకు కేటాయించాలనే ప్రతిపాదన చర్చనీయాంశమైంది. ఈ అంశంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం 24శాతం రిజర్వేషన్‌ ఉంది. కేటగిరీ -1 కింద ఓబీసీలకు 4శాతం, కేటగిరీ-2ఏ కింద 15శాతం ఇలా మొత్తం 43 శాతం రిజర్వేషన్‌ అమలవుతోంది. ముస్లింలకు 4శాతం కల్పిస్తే.. 47శాతానికి పెరుగుతుంది. శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమేనని, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సీఎం కార్యాలయం(సీఎంవో) స్పష్టం చేసింది.

Updated Date - Nov 13 , 2024 | 05:54 AM