CAA Law: కేంద్రం సంచలన నిర్ణయం.. అమల్లోకి వచ్చిన పౌరసత్వ చట్టం
ABN , Publish Date - Mar 11 , 2024 | 06:15 PM
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను (CCA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను (CCA) కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. బిల్లు ఆమోదం పొందిన నాలుగేళ్ల తర్వాత చట్టరూపం దాల్చింది. సీసీఏ చట్టాన్ని అమలుపరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టం అమల్లోకి రావడంతో మతం ఆధారంగా మొదటిసారి భారత పౌరసత్వ దక్కనుంది. 2019లో సీఏఏకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. దాదాపు 100 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ చట్టాన్ని అమలు చేయబోమంటూ పలు రాష్ట్రాలు శాసన సభలో తీర్మానం కూడా చేశాయి. మొత్తంగా తీవ్ర ప్రతిఘటన పరిస్థితుల మధ్య ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాగా సీఏఏని అమలు చేస్తామని 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన వాగ్దానాన్ని అమలు పరిచినట్టయ్యింది.
సీఏఏ చట్టం ఏం చెబుతోంది?
డిసెంబర్ డిసెంబర్ 31, 2014 వరకు బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరులైన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీలు, క్రిస్టియన్లకు భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ సీఏఏ బిల్లు 2019 డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. పార్లమెంటులో బిల్లు ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలు, పోలీసు చర్యల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2020 నుంచి పార్లమెంటరీ కమిటీ నిబంధనలు రూపొందిస్తోందనే కారణంగా హోం శాఖ ఎప్పటికప్పుడు నిబంధనల నోటిఫై చేయడాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి చట్టం అమలుపై వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Supreme Court: ఎస్బీఐ బాండ్ల కేసులో ఉత్తర్వులు పాటించకుంటే ధిక్కరణ చర్యలు
PM Modi: మూడో సారి నేనే ప్రధాని.. మహిళలే ప్రాధాన్యతగా పథకాలు తెస్తామన్న మోదీ
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి