UP: యూపీలో విషాదం.. తేనెటీగల దాడిలో 40 మంది విద్యార్థులకు..
ABN, Publish Date - Apr 24 , 2024 | 06:47 AM
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలో మంగళవారం తేనెటీగలు(Honey Bees) విజృంభించాయి.
ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో 40 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని ఆగ్రా జిల్లా బాహ్ ప్రాంతంలో మంగళవారం తేనెటీగలు(Honey Bees) విజృంభించాయి.
ఓ పాఠశాల సమీపంలోని ఓ చెట్టు పై నుంచి తేనెతుట్టె అకస్మాత్తుగా కిందపడింది. అక్కడే ఉన్న విద్యార్థులపై తేనెటీగలు ఒక్క సారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో 40మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. వారిలో 6 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
పాఠశాల సిబ్బంది ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. స్కూల్ భద్రత వైఫల్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రులు పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తేనెటీగలు దాడి చేశాయని వారు అన్నారు. పాఠశాల గేటు సమీపంలో తేనెతుట్టె ఉందని తెలిసినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రిన్సిపల్ మంజు రాణి త్యాగి మాట్లాడుతూ.. గాయపడిన విద్యార్థులను వైద్య సంరక్షణ కోసం బాహ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లామని, పాఠశాలను తాత్కాలికంగా మూసివేసినట్లు ఆమె తెలిపారు. బాహ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ జితేంద్ర వర్మ మాట్లాడుతూ.. ఆరుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉందని, ప్రాథమిక చికిత్స చేసి ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేసినట్లు చెప్పారు.
Updated Date - Apr 24 , 2024 | 06:48 AM