ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బిహార్‌లో పవిత్ర స్నానాలకు వెళ్లి 46 మంది మృతి

ABN, Publish Date - Sep 27 , 2024 | 04:37 AM

బిహార్‌లో ‘పవిత్ర స్నానాల’ కోసం వెళ్లి కనీసం 46 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 37 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ‘జీవితపుత్రిక’ పండుగ సందర్భంగా తమ పిల్లలు దీర్ఘాయువుతో జీవించాలని మహిళలు ఉపవాసం చేసి అనంతరం వారి బిడ్డలతో కలిసి నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.

పట్నా, సెప్టెంబరు 26: బిహార్‌లో ‘పవిత్ర స్నానాల’ కోసం వెళ్లి కనీసం 46 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 37 మంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. ‘జీవితపుత్రిక’ పండుగ సందర్భంగా తమ పిల్లలు దీర్ఘాయువుతో జీవించాలని మహిళలు ఉపవాసం చేసి అనంతరం వారి బిడ్డలతో కలిసి నదులు, చెరువులలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. గురువారం పండుగ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పవిత్ర స్నానాల కోసం ప్రజలు పోటెత్తారు. 15జిల్లాల్లో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మొత్తం 46 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై సీఎం నితీశ్‌కుమార్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Updated Date - Sep 27 , 2024 | 04:37 AM