NEW DELHI : సరిహద్దులో 49 పాక్ డ్రోన్ల కూల్చివేత
ABN, Publish Date - May 15 , 2024 | 03:23 AM
ఓ పక్క దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే... మరోపక్క సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల అక్రమ చొరబాట్లు కలకలం రేపుతున్నాయి.
న్యూఢిల్లీ, మే 14: ఓ పక్క దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావిడి కొనసాగుతుంటే... మరోపక్క సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ల అక్రమ చొరబాట్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకొచ్చిన ఈ 60 రోజుల్లో భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఏకంగా 49 పాకిస్థాన్ డ్రోన్లను కూల్చివేసినట్లు బీఎ్‌సఎఫ్ వెల్లడించింది. వీటిలో అత్యధికంగా 47 డ్రోన్లు పంజాబ్ సరిహద్దులో పట్టుబడగా, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్, బికానీర్ సెక్టార్లలో మిగతా 2 బీఎ్‌సఎ్‌ఫకు చిక్కాయి. కాగా, బీఎ్‌సఎఫ్ నివేదిక ప్రకారం, 2022 జనవరి- మే మాసాల మధ్య కేవలం 6 పాకిస్థాన్ డ్రోన్లు పట్టుబడగా, 2023లో అదే వ్యవధిలో వాటి సంఖ్య 14కి చేరింది. ఇక 2024లో ఏకంగా 75కి చేరడం గమనార్హం.
Updated Date - May 15 , 2024 | 07:09 AM