ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అమెరికాలో 550 మంది అరెస్టు

ABN, Publish Date - Apr 28 , 2024 | 05:36 AM

పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు చేసినా, ఆందోళనలు విరమించేందుకు ససేమిరా అంటున్నారు. ఇజ్రాయిల్‌లో పెట్టుబడులను వర్సిటీలు నిలిపివేయాలని, గాజాపై యుద్ధానికి ఆజ్యం పోస్తున్న ఆయుధాల తయారీలోనూ పెట్టుబడులను ఆపేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

పాలస్తీనాకు సంఘీభావంగా వర్సిటీల్లో ఆందోళనలు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 27: పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు చేసినా, ఆందోళనలు విరమించేందుకు ససేమిరా అంటున్నారు.

ఇజ్రాయిల్‌, Israel లో పెట్టుబడులను వర్సిటీలు నిలిపివేయాలని, గాజాపై యుద్ధానికి ఆజ్యం పోస్తున్న ఆయుధాల తయారీలోనూ పెట్టుబడులను ఆపేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. అరెస్టులకు తాము సిద్ధంగానే ఉన్నామని తేల్చిచెబుతున్నారు.


హార్వర్డ్‌, కొలంబియా, యేల్‌, యూసీ బెర్కెలే (Harvard, Columbia, Yale, UC Berkeley) తదితర ప్రఖ్యాత యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలన్నీ అనధికారికమేనని వర్సీటీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులను పిలిపించారు. అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో గత రెండు రోజులుగా యాజమాన్యం పోలీసులను రప్పించి, నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ తదితరాలను ప్రయోగించింది.


ఆస్టిన్‌లోని టెక్సాస్‌ యూనివర్సిటీలో అశ్విక దళాలను రంగంలోకి దించి నిరసనకారులను చెదరగొట్టారు. పలు చోట్ల విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఎమోరీ యూనివర్సిటీలో మహిళా ప్రొఫెసర్‌ను కిందపడేసి చేతులు వెనక్కి లాగి సంకెళ్లు వేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాలస్తీనాలో మృతుల సంఖ్య 34,305కు చేరింది.

తామంతా పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్నామని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే, విద్యార్థుల డిమాండ్లను వర్సిటీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. ఆ డిమాండ్లు దేశ విధానాలకు వ్యతిరేకమని వర్సిటీలు తేల్చిచెబుతున్నాయి.


కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులు రెండు వారాలకుపైగా టెంట్లు వేసుకొని నిరసన తెలుపుతున్నారు. టెంట్లు తొలగించాలంటూ అధికారులు జరుపుతున్న చర్చలు ప్రతిష్ఠంభనలో ఉన్నాయి.

కాగా, విద్యార్థుల అరెస్టులను మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. భావ ప్రకటన స్వేచ్ఛను అధికారులు గౌరవించాలని ఆ సంఘాలు హితవు పలికాయి. కాగా, కాలేజీల్లో నిరసన ప్రదర్శనలకు తావు లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వారం క్రితమే తేల్చిచెప్పారు.

Updated Date - Apr 28 , 2024 | 02:27 PM

Advertising
Advertising