Mumbai: ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో వృద్ధుడు మృతి.. కారణం అదే
ABN, Publish Date - Feb 17 , 2024 | 11:39 AM
ముంబయిలోని(Mumbai) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణం జరిగింది. వీల్‌చేర్ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ముంబయి: ముంబయిలోని(Mumbai) ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దారుణం జరిగింది. వీల్‌చేర్ అందుబాటులో లేకపోవడంతో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌కి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఫిబ్రవరి 12న భార్యతో కలిసి న్యూయార్క్ నుంచి ముంబయికి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చాడు.
ముంబయికి చేరుకున్నాక ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేయడానిక వెళ్తుండగా అస్వస్థకు గురయ్యాడు. అయితే అతని భార్య అప్పటికే వీల్ చేర్‌లో ఉంది. బాధితుడికి సైతం వీల్ చేర్ అవసరం పడగా.. సమయానికి ఎయిర్ పోర్ట్‌లో అది దొరక్క పోవడంతో అతను తన భార్యతో అలాగే కలిసి ముందుకు నడవసాగాడు.
ఎయిర్ పోర్ట్ వైద్యాధికారులు వృద్ధుడిని పరీక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే వీల్ చేర్ లేకపోవడంతోనే ఆయన తీవ్ర అస్వస్థతకు లోనైనట్లు డాక్టర్లు చెప్పారు. వీల్ చైర్లకు ఎంత డిమాండ్ ఉన్నా.. సరిపడినన్ని సమకూర్చడంలో ఎయిర్ పోర్ట్ అధికారులు విఫలమవుతున్నారని.. తోటి ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Feb 17 , 2024 | 11:39 AM