ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Airline Threats: ఎయిర్‌లైన్స్‌కు 999 బాంబు బెదిరింపులు.. మరోవైపు కేసులు కూడా..

ABN, Publish Date - Nov 29 , 2024 | 10:20 AM

దేశంలో ఇటివల విమానయాన సంస్థలకు వచ్చిన నకిలీ బాంబు బెదిరింపుల గురించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 999 బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఇవి ఎన్ని రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

bomb threats to airlines

దేశంలో నకిలీ బాంబు బెదిరింపుల ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతి రోజూ కొన్ని విమాన ప్రయాణాల్లో(air lines) బాంబు బెదిరింపులు (fake bomb threats) వస్తుండటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు విమానాల ఆలస్యంతో ఆయా సంస్థలు కూడా నష్టపోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటివల పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు పలువురిని విస్మయానికి గురిచేస్తున్నాయి. గత రెండేళ్లలో ఇలాంటి కాల్స్ 1100కు పైగా వచ్చినట్లు తేలింది. నవంబర్ 28న లోక్‌సభలో భారత ప్రభుత్వ పౌర విమానయాన శాఖ మంత్రి ఈ సమాచారాన్ని వెల్లడించారు.


అసలు విషయం ఏమిటి?

ఆగస్టు 2022 నుంచి నవంబర్ 14, 2024 వరకు మొత్తం 1148 నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయని తెలిపారు. కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయన్నారు. 2024 సంవత్సరంలోనే 11 నెలల్లో కేవలం ఎయిర్ లైన్స్‌కే 999 బాంబు బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఈ బెదిరింపుల కారణంగా విమానాలు సకాలంలో ఎగరడంలో ఇబ్బంది ఏర్పడినట్లు తెలిపారు. ఆ క్రమంలో ప్రయాణీకులు తమ గమ్యాన్ని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. బెదిరింపులు వచ్చిన తర్వాత విచారణ జరిగిన క్రమంలో విమానాలు ఆలస్యం అయినట్లు తెలిపారు.


ఏం చర్యలు తీసుకున్నారు?

ఈ బూటకపు బాంబు బెదిరింపులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా ప్రభుత్వం చెప్పింది. జనవరి 2024 నుంచి ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు 256 ఎఫ్‌ఐఆర్‌లు, 12 అరెస్టులు జరిగాయి. అక్టోబరు 14 నుంచి నవంబర్ 14, 2024 మధ్య 163 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మరోవైపు ఇవి కాకుండా ఆస్పత్రులు, స్కూళ్లు సహా పలు సంస్థలకు వచ్చిన నకిలీ బెదిరింపు కాల్స్ కూడా కలిపితే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.


చట్టంలో మార్పులను ప్రభుత్వం పరిశీలిస్తోంది

అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ అంశానికి సంబంధించిన చట్టాలను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం గవర్నమెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ (సేఫ్టీ) రూల్స్, 2023లో మార్పులు చేయవచ్చని నమ్ముతున్నారు. నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో ఫ్లై లిస్టులో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు.


సెఫ్టీ ప్లాన్

పెద్ద సంఖ్యలో నకిలీ బెదిరింపులు ఉన్నప్పటికీ భారతదేశంలోని ఏ విమానాశ్రయం లేదా విమానంలో అసలు బాంబు బెదిరింపులు కనుగొనబడలేదు. అటువంటి బెదిరింపులకు ప్రతిస్పందించడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), BTAC (బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీలు) వెంటనే చర్యలు తీసుకుంది. ఈ నకిలీ బెదిరింపులు కొన్ని కార్యాచరణ అంతరాయాలను కలిగించినప్పటికీ, ముఖ్యంగా విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు ఇతర వాటాదారులను ప్రభావితం చేసినప్పటికీ విమానాలు లేదా ప్రయాణీకులకు ఎటువంటి ముప్పు సంభవించలేదు.


ఇవి కూడా చదవండి:

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

BSNL: మరో అద్భుతమైన ప్లాన్‌ తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్.. 90 రోజులకు చెల్లించేది కేవలం..


Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..


Read More National News and Latest Telugu News

Updated Date - Nov 29 , 2024 | 10:23 AM