ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సీఎం రమేశ్‌పై కేసు నమోదు

ABN, Publish Date - Apr 06 , 2024 | 03:05 AM

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్‌ ్స అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చోడవరం(అనకాపల్లి జిల్లా), ఏప్రిల్‌ 5: డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్‌ ్స అధికారుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చోడవరం శివారు గాంధీ గ్రామంలోని శిలపరశెట్టి రామకృష్ణ, శిలపరశెట్టి బుజ్జికి చెందిన టైల్స్‌ దుకాణంపై డీఆర్‌ఐ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సమాచారం తెలియడంతో సీఎం రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు, టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పిన సీఎం రమేశ్‌ అక్కడినుంచి వెనుదిరిగారు. అయితే తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఆర్‌ఐ ఏడీ ఎంఎ్‌సఆర్‌కే సోమేశ్‌ గురువారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఎం రమేష్‌, కేఎ్‌సఎన్‌ఎస్‌ రాజు, టైల్స్‌ వ్యాపారి రామకృష్ణ, అతని సోదరుడు బుచ్చిబాబు, వారి ఇద్దరు కుమార్తెలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 06 , 2024 | 03:05 AM

Advertising
Advertising