ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National :చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన చైనా స్పేస్‌ క్రాఫ్ట్‌

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:07 AM

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ఘనత సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తమ స్పేస్‌ క్రాఫ్ట్‌ను రెండోసారి విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు తమ స్పేస్‌ క్రాఫ్ట్‌ చాంగే-6 చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఏకెన్‌ బేసిన్‌ వద్ద ల్యాండ్‌ అయినట్లు చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీఎన్‌ఎ్‌సఏ) ప్రకటించింది.

  • అక్కడి నుంచి 2 కిలోల మట్టి, రాళ్ల నమూనాలను తేవడమే లక్ష్యం

బీజింగ్‌, జూన్‌ 2: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ఘనత సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తమ స్పేస్‌ క్రాఫ్ట్‌ను రెండోసారి విజయవంతంగా ల్యాండ్‌ చేసింది. బీజింగ్‌ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు తమ స్పేస్‌ క్రాఫ్ట్‌ చాంగే-6 చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఏకెన్‌ బేసిన్‌ వద్ద ల్యాండ్‌ అయినట్లు చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీఎన్‌ఎ్‌సఏ) ప్రకటించింది.

2019లో చాంగే-4 స్పేస్‌ క్రాఫ్ట్‌ను కూడా చైనా దక్షిణ ధ్రువంపైనే దింపి ఆ ఘనత సాధించిన ఏకైక దేశంగా అప్పట్లో రికార్డు సృష్టించింది. చాంగే-6 స్పేస్‌ క్రాఫ్ట్‌ను మే 3న అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇందులో ఆర్బిటర్‌, ల్యాండర్‌, అసెండర్‌, రీఎంట్రీ అనే 4 రకాల మాడ్యూల్స్‌ ఉన్నాయి.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను చాంగే-6 ప్రయోగం ద్వారా భూమిపైకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకొంది. నమూనాల సేకరణ 14 గంటల్లో పూర్తయ్యేలా మిషన్‌కు రూపకల్పన చేసింది. చాంగే-6 ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతం కావడంతో 2030లో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు చైనా యత్నిస్తోంది. కాగా, తాజా ప్రయోగంలో చైనా.. ఫ్రాన్స్‌, ఇటలీ, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలతో పాటు పాకిస్థాన్‌కు చెందిన పేలోడ్‌ను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లింది.

Updated Date - Jun 03 , 2024 | 06:07 AM

Advertising
Advertising