ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Prepaid Meter: విద్యుత్ కావాలంటే రీచార్జ్ చేసుకోవాల్సిందే.. త్వరలో నయా మీటర్స్..!

ABN, Publish Date - Feb 17 , 2024 | 04:26 AM

Prepaid Meter: విద్యుత్‌ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్‌ మీటర్ల నెట్‌వర్క్‌లోకి తేవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. రీవ్యాం ప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎ్‌సఎస్‌) కింద దేశవ్యాప్తంగా 19.79 కోట్ల

Prepaid Energy Meter

‘రీచార్జ్‌’ అయిపోయాక సందేశాలు ఇచ్చి డిస్‌కనెక్షన్‌

ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద గైడ్‌లైన్స్‌

దేశవ్యాప్తంగా 19.79 కోట్ల కనెక్షన్లకు బిగించాలని కేంద్ర విద్యుత్‌ శాఖ నిర్ణయం

52.19 లక్షల డీటీఆర్‌లు, 1.88 లక్షల ఫీడర్లకూ బిగించే యోచన

హైదరాబాద్‌, ఫిబ్రవరి16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగదారులందరినీ ప్రీపెయిడ్‌ మీటర్ల నెట్‌వర్క్‌లోకి తేవాలని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. రీవ్యాం ప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎ్‌సఎస్‌) కింద దేశవ్యాప్తంగా 19.79 కోట్ల కనెక్షన్లు, 52.19 లక్షల దాకా పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌), 1.88 లక్షల ఫీడర్లకు ప్రీపెయిడ్‌/స్మార్ట్‌మీటర్లు బిగించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో మీటర్ల బిగింపు/అమలు ప్రక్రియపై స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎ్‌సవోపీ)ను జారీ చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించుకునేవారు ఒక నెలలో ఎంత మేర కరెంట్‌ను వాడుతున్నారో ఆ మేరకు అడ్వాన్స్‌గా డిస్కమ్‌లకు చెల్లించి రీచార్జ్‌ చేసుకోవాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోగానే వినియోగదారు మొబైల్‌కు మూడుసార్లు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపాలి. అలాగే సదరు వినియోగదారుకు గరిష్ఠంగా రూ.300 క్రెడిట్‌ ఇవ్వాలని కేంద్రం సూచించింది. అంటే రూ.1,000 రీచార్జ్‌ చేసుకుంటే అదనంగా రూ.300 కరెంట్‌ను వాడుకునే వెసులుబాటు ఇవ్వాలి. ముందు చెల్లించిన రూ.1000లో వినియోగం పూర్తవుతూ రూ.50 మిగిలి ఉండగానే రీచార్జ్‌ చేసుకునేలా తొలి సందేశం పంపాలి. రీచార్జ్‌ మొత్తం అయిపోయాక మరోసారి, క్రెడిట్‌గా ఇచ్చిన రూ.200 కరెంట్‌ను వాడుకున్న తర్వాత మూడోసారి సందేశం ఇచ్చి డిస్‌కనెక్ట్‌(విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి) చేయాలని కేంద్రం పేర్కొంది. వినియోగదారుడు మళ్లీ రీచార్జ్‌ చేసుకున్న 15 నిమిషాల్లోపే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించాక మొబైల్‌లో సంబంధిత యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలని, వినియోగదారుడు ఈ యాప్‌ ఆధారంగా విద్యుత్‌ వినియోగాన్ని నియంత్రించుకోవొచ్చని పేర్కొంది. దీని ద్వారా ఇంట్లో లేనప్పుడు మీటర్‌ను ఆఫ్‌ చేయొచ్చు.

Updated Date - Feb 17 , 2024 | 06:55 AM

Advertising
Advertising