ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal: బీజేపీతోపాటు ఎల్జీపై మళ్లీ మండిపడ్డ ఆప్

ABN, Publish Date - Jul 21 , 2024 | 03:31 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ క్రమంలో బీజేపీతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.

న్యూఢిల్లీ, జులై 21: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్ర ఆందోళనలో ఉంది. ఆ క్రమంలో బీజేపీతోపాటు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి నిప్పులు చెరిగారు. ఆదివారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తీహాడ్ జైలు వేదికగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ వైద్య పరీక్షల నివేదికను ఆయన ఉటంకించారు. తీహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎప్పుడేదైనా జరగవచ్చనని ఎంపీ సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఆయనకు ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని కేజ్రీవాల్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికే స్పష్టం చేస్తుందన్నారు. ఒక విధంగా కేజ్రీవాల్ జీవితంతో బీజేపీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ తన ఆరోగ్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా చెడగొట్టుకుంటున్నారంటూ ఎల్జీ వికె సక్సెనా పేర్కొనడంపై ఎంపీ సంజయ్ సింగ్‌ స్పందించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులోనున్న కేజ్రీవాల్‌కు వైద్యులు సూచించిన ఆహారం, మందులు వినియోగించకపోవడం పట్ల ఎల్జీ సక్సేనా ఆందోళన చెందుతున్నారు.

Also Read: New Delhi: జగన్ పాలనలో అప్పులు ఘనం.. అభివృద్ధి శూన్యం


అందులోభాగంగా ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎల్‌జీ కార్యాలయం శుక్రవారం లేఖ రాసిందని.. దీనికి గల కారణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారన్నారు. మరోవైపు జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడమే కాదు.. ఆయన చాలా బరువు తగ్గారని గుర్తు చేశారు. ఇక కేజ్రీవాల్‌కు షుగర్ వ్యాధీ ఉందన్నారు. ఆ క్రమంలో ఆయన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు సైతం భారీగా తగ్గాయని చెప్పారు. దీంతో ఆయన ఏ క్షణమైనా కోమాలోకి వెళ్లే అవకాశాలు ఉండమే కాకుండా.. ఆయన మరణానికి చేరువయ్యే అవకాశం ఉందని సంజయ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 21 , 2024 | 03:31 PM

Advertising
Advertising
<