ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆప్‌ సోషల్‌ మీడియా ఉద్యమం

ABN, Publish Date - Mar 26 , 2024 | 03:18 AM

మద్యం విధానం కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తోంది.

రాజ్యాంగ పరిక్షణ పేరిట పోరాటం

న్యూఢిల్లీ, మార్చి 25: మద్యం విధానం కేసులో అరెస్టయి కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చర్యలను ప్రశ్నిస్తుండడంతోపాటు రాజ్యాంగ రక్షణ కోసమంటూ సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాన్ని ప్రారంభించింది. ఢిల్లీ మంత్రి ఆతిషి సోమవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ రక్షణ కోసం సోషల్‌ మీడియాలో పోరాటం ప్రారంభించామని చెప్పారు. ఆప్‌ కార్యకర్తలు, నాయకులు అందరూ ‘డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌) కాంపెయిన్‌’ నిర్వహిస్తారని తెలిపారు. ‘డీపీ’ కింద కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్‌ ఫొటో పెడుతారని చెప్పారు. దాని కింద ‘మోదీ కే సబ్‌సే బడా దార్‌ కేజ్రీవాల్‌’ (మోదీని ఎదిరించే మొనగాడు కేజ్రీవాల్‌) అన్న క్యాప్షన్‌ పెడుతారు. రెండేళ్ల క్రితం ఉపయోగించిన ఫోన్‌ను కేజ్రీవాల్‌ ధ్వంసం చేశారని, మద్యం కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అందులో ఉండి ఉండవచ్చని ఈడీ వర్గాలు చెప్పడంపైనా ఆతిషి అభ్యంతరం చెప్పారు. ఆ ఫోన్‌ కనిపించడం లేదని, అదెక్కడ ఉందో కూడా తెలియదని దర్యాప్తులో కేజ్రీవాల్‌ చెప్పినట్టు పేర్కొన్నాయి. ఈ కేసులోని సాక్షులు మొత్తం 170 సెల్‌ఫోన్లను పారవేసి, ఆధారాలు నాశనం చేసినట్టు గతంలో ఈడీ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని అఫిడవిట్‌ రూపంలో జడ్జి ముందు కోర్టులో చెప్పాలని ఆతిషి డిమాండ్‌ చేశారు. మరోవైపు కేజ్రీవాల్‌ భార్య సునీత పలువురు కార్యకర్తలతో కలిసి సోమవారం ఈడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడికి విచారణకు హాజరైన కేజ్రీవాల్‌తో మాట్లాడారు. కాగా జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు ఎలాంటి కంప్యూటర్లు, కాగితాలు సమకూర్చలేదని ఈడీ స్పష్టం చేసిం ది. అలాంటప్పుడు ఢిల్లీలోని మంచినీటి సమస్య విషయమై జైలు నుంచే ఏవిధంగా ఆదేశాలిచ్చారో ఆరా తీస్తామని తెలిపింది. జైలు నుంచే ఉత్తర్వులు ఇచ్చారంటూ చెప్పిన మంత్రి ఆతిషి నుంచి వివరాలు సేకరిస్తామని పేర్కొం ది. జైలు నుంచే కేజ్రీవాల్‌ లేఖ ఇచ్చారంటూ మంత్రి చెప్పడాన్ని బీజేపీ ఖం డించింది. అనుకున్న ప్రకారం జరుగుతున్న నాటకమని విమర్శించింది.

Updated Date - Mar 26 , 2024 | 03:18 AM

Advertising
Advertising