మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Calcutta High Court : బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

ABN, Publish Date - May 23 , 2024 | 05:58 AM

పశ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి టీఎంసీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 నుంచి రూపొందించిన ఓబీసీ జాబితా పూర్తిగా

Calcutta High Court  : బెంగాల్లో ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు

2010 నుంచి జారీ చేసినవి చెల్లవన్న కలకత్తా హైకోర్టు

తీర్పును అంగీకరించబోం: మమత

కోల్‌కతా, మే 22: పశ్చిమ బెంగాల్‌లో 2010 నుంచి టీఎంసీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 నుంచి రూపొందించిన ఓబీసీ జాబితా పూర్తిగా ‘చట్టవిరుద్ధం’ అని స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్‌ బీసీ కమిషన్‌ సారథ్యంలో ‘వెస్ట్‌ బెంగాల్‌ కమిషన్‌ ఫర్‌ బీసీ యాక్ట్‌-1993 ప్రకారం కొత్తగా ఓబీసీల జాబితా రూపొందించాలని ఉత్తర్వుల్లో నిర్దేశించింది. బెంగాల్‌లో 1993 చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఓబీసీల జాబితా రూపొందించారని, ఫలితంగా అసలు ఓబీసీలకు అన్యాయం జరిగిందంటూ 2011లో దాఖలైన పిల్‌పై హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఓబీసీ సర్టిఫికెట్ల ద్వారా సర్వీసుల్లో ఉన్న వారికి, ఆ రిజర్వేషన్‌ కారణంగా ప్రయోజనం పొందిన వారికి, ఇప్పటికే ఏదైనా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి సెలెక్షన్‌ ప్రాసె్‌సలో ఉన్నవారికి ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును అంగీకరించే ప్రసక్తే లేదని మమత అన్నారు. రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల కోటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓబీల రిజర్వేషన్లపై తాము ఇంటింటికి తిరిగి సర్వే చేశామని, రాజ్యాంగం ప్రకారం బిల్లు క్యాబినెట్‌లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలోనూ ఆమోదింపజేసుకున్నామని వివరించారు.

Updated Date - May 23 , 2024 | 05:58 AM

Advertising
Advertising