ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కన్నుమూత

ABN, Publish Date - Jun 23 , 2024 | 02:55 AM

అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ శనివారం తుదిశ్వాస విడిచారు.

అయోధ్య, జూన్‌ 22: అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ శనివారం తుదిశ్వాస విడిచారు. 86 ఏళ్ల లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ కొన్ని రోజులుగా అనార్యోగ కారణాలతో బాధపడుతున్నారని ఈ క్రమంలోనే శనివారం ఉదయం కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలను వారాణసిలోని మణికర్ణిక ఘాట్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనవరి 22న అయోధ్యలో జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన అర్చకుడిగా వ్యవహరించారు. లక్ష్మీకాంత్‌ దీక్షితులు మృతిపై ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘కాశీలోని పండితుల్లో లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ గొప్పవారు. ఆయన మృతి ఆధ్యాత్మిక, సాహితీ ప్రపంచానికి తీరని లోటు’’ అని యోగి ఆదిత్యనాథ్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 02:58 AM

Advertising
Advertising