ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్డు ప్రమాదాల్లో రోజుకు సగటున 474 మంది దుర్మరణం

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:08 AM

దేశవ్యాప్తంగా రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

న్యూఢిల్లీ, అక్టోబరు 20: దేశవ్యాప్తంగా రహదారులు నెత్తురోడుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారు. గత ఏడాదిలో రోడ్డు ప్రమాదాల వల్ల 1.7 లక్షలకుపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి వివరాలను సమర్పించాయి. ఈ లెక్కన రోజుకు సగటున 474 మంది లేదా ప్రతి మూడు నిమిషాలకు దాదాపుగా ఒకరు మృత్యువాత పడినట్టు చెప్పవచ్చు. ప్రమాదాల వెనుక కారణాలు, సమస్యలను మదింపు చేయడానికి జాతీయ స్థాయిలో కేంద్రం రోడ్డు ప్రమాదాల గణాంకాలను క్రోడీకరించడం మొదలు పెట్టినప్పటి నుంచి గత ఏడాదిలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయి.

ఇక రోడ్డు ప్రమాదాల కారణంగా గాయాలపాలవుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. గత ఏడాదిలో దాదాపు 4.63 లక్షల మంది గాయాలపాలయ్యారు. 2022 సంవత్సరంతో పోల్చితే ఇది 4 శాతంకన్నా ఎక్కువ. కాగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం గత ఏడాదిలో రోడ్డు ప్రమాదాల మూలంగా జరిగిన మరణాలు 1.6 లక్షలకు పైనే ఉన్నాయి.

Updated Date - Oct 21 , 2024 | 03:08 AM