ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Agra: వ్యభిచారం కేసులో కూతురి అరెస్టు అంటూ ఫోన్.. గుండెపోటుతో తల్లి మృతి

ABN, Publish Date - Oct 04 , 2024 | 10:18 AM

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన కూతురిని వ్యభిచారం కేసులో అరెస్టు చేసినట్టు ఫోన్ కాల్ రావడంతో హడలిపోయిన ఓ టీచర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆగ్రాలో వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: సైబర్ నేరగాళ్ల ఆగడాలకు మరో నిండు ప్రాణం బలైపోయింది. తన కూతురిని వ్యభిచారం కేసులో అరెస్టు చేసినట్టు ఫోన్ కాల్ రావడంతో హడలిపోయిన ఓ టీచర్ హడావుడిగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ తరువాత 15 నిమిషాలకే గుండె పోటుతో కన్నుమూసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో వెలుగు చూసిన ఈ ఉదంతం స్థానికంగా సంచలనం రేపింది.

Viral: అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1,357 కిలోమీటర్ల వేగంతో కిందకొస్తూ..


పూర్తి వివరాల్లోకి వెళితే, మాలతీ వర్మ అనే మహిళ టీచర్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న ఆమెకు వాట్సాప్‌లో ఎవరో కాల్ చేశారు. ఆమె కూతురు వ్యభిచారం కేసులో అరెస్టు అయినట్టు చెప్పారు. రూ. లక్ష తక్షణం చెల్లించకపోతే వెంటనే ఆమె వీడియోలను బయటపెడతామని బెదిరించారు. దీంతో, కంగారు పడిపోయిన మహిళ వెంటనే తన కుమారుడు దివ్యాన్షూకు ఫోన్ చేసిన విషయం చెప్పింది. వారు కోరినట్టు డబ్బులు బదిలీ చేయమని చెప్పింది. ఇదంతా అనుమానాస్పదంగా ఉండటంతో మాలతీ కుమారుడు ఫోన్ నెంబర్ కనుక్కున్నాడు. నెంబర్ ముందు +92 అని ఉండటంతో అది పాక్ నుంచి సైబర్ నేరగాళ్లు చేసిన ఫోన్ అని గుర్తించాడు.

Viral: స్ఫూర్తి రగిలించే గెద్ద వీడియో.. ఆనంద్ మహీంద్రా కామెంట్స్ వైరల్!


దివ్యాన్షూ తన తల్లికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు. కంగారు పడాల్సిన అవసరం లేదని అన్నాడు. అయితే, అప్పటికే తీవ్ర కంగారులో ఉన్న ఆమె స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. ఆ తరువాత పావుగంటకే కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా బాధితురాలు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. తన సోదరుడు దివ్యాన్షూ తనకు ఫోన్ చేసి విషయం చెప్పాడని అతడి సోదరి పేర్కొంది. తాను బాగానే ఉన్నానని, కాలేజీలో ఉన్నానని చెప్పినట్టు పేర్కొంది. కానీ ఇంతలోనే ఈ ఘోరం జరుగుతుందని అస్సలు ఊహించలేదంటూ కన్నీరు మున్నీరైంది.

Viral: భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..


ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ వచ్చిన నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు, ఘటనపై స్థానిక కాంగ్రెస్ కూడా స్పందించింది. ఇటీవల కాలంలో ‘డిజిటల్ అరెస్టు’ ఉదంతాలు పెరిగిపోతున్నాయని, ఎందరో అమాయకులు బలైపోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది.

Read Latest and National News

Updated Date - Oct 04 , 2024 | 10:33 AM