ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AI : క్షయ, మలేరియా చికిత్సల రూపకల్పనలో శాస్త్రీయ జ్ఞానానికి ఏఐ హంగు

ABN, Publish Date - May 30 , 2024 | 05:51 AM

రకరకాల రోగాలకు మందులు కనిపెట్టి ఆధునిక మానవుణ్ని చాలా కాలంగా కాపాడుతూ వస్తున్నది శాస్త్రీయ విజ్ఞానం(సైన్స్‌). దానికి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం

సీసీఎంబీ, అగణిత సంస్థల మధ్య ఒప్పందం

హైదరాబాద్‌, మే 29: రకరకాల రోగాలకు మందులు కనిపెట్టి ఆధునిక మానవుణ్ని చాలా కాలంగా కాపాడుతూ వస్తున్నది శాస్త్రీయ విజ్ఞానం(సైన్స్‌). దానికి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు తోడవుతూ వస్తోంది. ఇప్పుడా రెండింటికీ.. కృత్రిమ మేధ అనే హంగును కూడా జోడిస్తే? అద్భుతమైన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా..! ఆ లక్ష్యంతోనే.. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీ (సీసీఎంబీ).. అగణిత అనే సంస్థతో జతకట్టింది. ఈ మేరకు ఈ రెండు సంస్థలూ బుధవారం ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం మేరకు ప్రాథమికంగా.. మలేరియా, క్షయ, నాడీవ్యాధులకు సంబంధించి.. యాంటీబాడీలు, నానోబాడీల ఇంజనీరింగ్‌, స్మాల్‌ మాలిక్యూల్‌ డిజైన్‌, టార్గెట్‌ అనాలసిస్‌ సహా పలు అంశాలపై రెండు సంస్థలూ కలిసి పనిచేయనున్నాయి. కొత్త చికిత్సలను, రిసెర్చ్‌ టూల్స్‌ను డిజైన్‌ చేసేందుకు జనరేటివ్‌ ఏఐ సొల్యూషన్స్‌ను ఉపయోగించనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆయా వ్యాధులకు సంబంధించి సీసీఎంబీ పరిశోధన శాలలో గుర్తించిన విషయాలను చికిత్సల రూపంలో అందరికీ అందుబాటులోకి తేవడానికి అగణిత ఏఐ పరిజ్ఞానం ఉపకరిస్తుంది.

Updated Date - May 30 , 2024 | 05:51 AM

Advertising
Advertising