ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్‌కు చెక్‌

ABN, Publish Date - Jul 08 , 2024 | 05:20 AM

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌) నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్‌.. లెనాకాపవిర్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు

లెనాకాపవిర్‌ పేరుతో అభివృద్ధి

చేసిన గిలియడ్‌ సైన్సెస్‌ కంపెనీ

దక్షిణాఫ్రికా, ఉగాండాలో ట్రయల్స్‌

100ు సక్సెస్‌.. ఈ ఇంజెక్షన్‌

తీసుకున్న 2,134 మంది సురక్షితం

మరిన్ని అధ్యయనాల తర్వాత మార్కెట్‌లోకి విడుదల

హైదరాబాద్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌) నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్‌..

లెనాకాపవిర్‌ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా రెండుసార్లు ఈ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా ఆ వైరస్‌కు చెక్‌ పెట్టవచ్చు. నిజానికి హెచ్‌ఐవీని నిరోధించే రెండు రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి పొందిన ట్రువాడా మాత్ర. రెండోది.. 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవీ. ఆ రెండింటితో పోలిస్తే క్లినికల్‌ ట్రయల్స్‌లో ఈ ఇంజెక్షన్‌ నూటికి నూరుశాతం విజయవంతం కావడం గమనార్హం. ఈ ఔషధం.. హెచ్‌ఐవీ క్యాప్సిడ్‌ (వైరస్‌ చుట్టూ ఉండే ప్రొటీన్లతో కూడిన రక్షణ పొర)ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్‌ తన సంఖ్యను పెంచుకోకుండా చేస్తుంది. ఆఫ్రికా దేశాల్లో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్‌ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను సౌతాఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని 3 ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్స్‌లో భాగంగా 5000 మంది మహిళలను ఎంచుకుని వారిని మూడు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలోని 2134 మంది మహిళలకు లెనాకాపవిర్‌ ఇంజెక్షన్‌ ఇచ్చారు. రెండో కేటగిరీలోని 1068 మందికి ట్రువాడా, 2136 మందికి డెస్కోవీ మాత్రలు ఇచ్చారు. వీరిలో ట్రువాడా మాత్ర తీసుకున్నవారిలో 16 మందికి, డెస్కోవీ మాత్ర తీసుకున్నవారిలో 39 మందికి ట్రయల్‌ సమయంలో హెచ్‌ఐవీ సోకింది. లెనాకాపవిర్‌ ఇంజెక్షన్‌ తీసుకున్న 2134 మందిలో ఒక్కరికి కూడా హెచ్‌ఐవీ సోకలేదు. అంటే.. 100 శాతం సక్సెస్‌. ఎయిడ్స్‌ కారక హ్యూమన్‌ ఇమ్యూనో వైరస్‌ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ లభిస్తుందని తేలింది. ట్రువాడా, డెస్కోవీ మాత్రలను అభివృద్ధి చేసిన అమెరికన్‌ ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ సంస్థే ఈ లెనాకాపవిర్‌నూ అభివృద్ధి చేసింది. తమ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సౌతాఫ్రికా, ఉగాండా దేశాల్లోని ఔషధ నియంత్రణ సంస్థలకు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనున్నట్లు గిలియడ్‌ సైన్సెస్‌ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త ఔషధాన్ని ఆమోదిస్తుందని తాము ఆశిస్తున్నట్లు గిలియడ్‌ సైన్సెస్‌ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్లోకి తీసుకువచ్చే ముందు ఈ ఔషధంపై మరిన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఈ ఔషధం అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు అందించే ఉద్దేశంతో గిలియడ్‌ సైన్సెస్‌ సంస్థ.. జనరిక్‌ డ్రగ్స్‌ తయారుచేసే కంపెనీలకు దీనికి సంబంధించిన లైసెన్స్‌లు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. అంటే ఆయా ఫార్మా కంపెనీలు కూడా ఈ ఔషధాన్ని తయారు చేస్తాయన్నమాట. తద్వారా ఇది ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ధర తగ్గుతుంది. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ ఔషధాన్ని విరివిగా కొనుగోలు చేసి... హెచ్‌ఐవీ నుంచి రక్షణ పొందాలనుకునే ప్రతీ ఒక్కరికి ఇవ్వాలని ఆ సంస్థ కోరింది. కాగా.. హెచ్‌ఐవీ చికిత్స నిమిత్తం ఈ డ్రగ్‌కు ఎఫ్‌డీఏ 2022లోనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - Jul 08 , 2024 | 05:20 AM

Advertising
Advertising
<