ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Air Chief Marshal: భారత్‌కూ ఐరన్‌ డోమ్‌ అవసరం

ABN, Publish Date - Oct 05 , 2024 | 04:49 AM

ఇజ్రాయెల్‌ దేశానికి ఉన్న ఐరన్‌ డోమ్‌ వంటి అత్యాధునిక గగన తల రక్షణ వ్యవస్థ మన దేశానికీ అవసరమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ అన్నారు.

  • వైమానిక దళ అధిపతి అమర్‌ ప్రీత్‌ సింగ్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 4 : ఇజ్రాయెల్‌ దేశానికి ఉన్న ఐరన్‌ డోమ్‌ వంటి అత్యాధునిక గగన తల రక్షణ వ్యవస్థ మన దేశానికీ అవసరమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ అన్నారు. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ల ఘర్షణను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం కొన్ని గగన తల రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నామన్నారు. అటువంటివి ఇంకా అవసరమని చెప్పారు. ఇవి పరిమితంగా ఉన్నందున వాటిని కీలక ప్రాంతాల్లో మోహరించాల్సి ఉందన్నారు. మిగిలిన చోట్ల గగనతల దాడులను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.


కొన్ని దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధాలు, ఘర్షణల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆయుధ సరఫరాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.అయితే ఇటువంటి పరిస్థితుల్లోనూ మనకు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుని, యుద్ధ సన్నద్ధతలో లోపం రాకుండా చూస్తున్నామన్నారు. వైమానికదళ సిబ్బంది నైపుణ్యం పైనా దృష్టి పెట్టామన్నారు. అందుకు నిరంతరం కసరత్తు జరుగుతూ ఉంటుందంటూ.. వాయు శక్తి, తరంగ్‌ శక్తి, గగన్‌ శక్తి కార్యక్రమాలను ఆయన ఉదహరించారు.


మనకు అవసరమైన యుద్ధ విమానాలు, ఆయుధ వ్యవస్థలకు విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తేజస్‌, తేజస్‌ ఎంకే2, ఏఎంసీఏ, అస్త్ర వంటి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయ్యామన్నారు. 2047కల్లా వైమానిక దళానికి అవసరమైనవన్నీ స్వదేశంలోనే అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమన్నారు. భారత్‌-చైనా సరిహద్దులో మొత్తంగా పరిస్థితి స్థిరంగా ఉన్నా... చైనా వైపు వేగంగా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నందున మనవైపు కూడా అంతే వేగంగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 04:49 AM