Viral: లోదుస్తుల్లో బంగారం దాచి ఎయిర్ ఇండియా సిబ్బంది స్మగ్లింగ్!
ABN, Publish Date - Dec 17 , 2024 | 08:12 PM
బంగారం స్మగ్లింగ్‌లో ప్యాసెంజర్‌కు సహాయపడిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం స్మగ్లింగ్‌లో ప్యాసెంజర్‌కు సహాయపడిన ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది ఒకరిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. సదరు వ్యక్తి నుంచి 1.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో వచ్చిన ఓ ప్యాసెంజర్‌ను అధికారులు చెన్నై ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్యాసెంజర్ తన బంగారాన్ని ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరికి ఇచ్చినట్టు వెల్లడించారు. దీంతో, కస్టమ్స్ అధికారులు సదరు ఎయిర్ ఇండియా ఉద్యోగిని తనిఖీ చేయగా లోదుస్తుల్లో దాగున్న బంగారం బయటపడింది. దీంతో అధికారులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది (Chennai).
Tributes to Zakir Hussain : జాకీర్ హుస్సేన్ మృతికి ప్రముఖుల నివాళి
కాగా, డిసెంబర్ 7న వెలుగు చూసిన మరో ఘటనలో కొకెయిన్ తరలిస్తున్న ఓ ఆఫ్రీకా మహిళ అధికారులకు చిక్కింది. రూ.14.2 కోట్ల విలువైన కొకెయిన్ క్యాప్సుల్స్‌ను మింగేసిన ఆమె వాటిని కడుపులో దాచుకుని ఇథియోపియా నుంచి భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. ఈ సమాచారం ముందుగానే అందుకున్న అధికారులు.. ఆమె చెన్నై ఎయిర్‌పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత వైద్యుల సాయంతో నిందితురాలి కడుపులోని 93 కొకెయిన దాచుంచిన క్యాప్సూల్స్‌ను వెలికితీశారు. ఆమె నుంచి మొత్తం 1.4 కేజీల కొకెయిన్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
Prashant Kishor: పీకే పార్టీకి గట్టి దెబ్బ.. కోర్ కమిటీకి మాజీ ఎంపీలు గుడ్‌బై
For National News And Telugu News
Updated Date - Dec 17 , 2024 | 08:15 PM