ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Night vision goggles : నైట్‌ విజన్‌ గాగుల్స్‌తో విమానం ల్యాండింగ్‌

ABN, Publish Date - May 24 , 2024 | 05:34 AM

భారత వాయుసేన మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా రాత్రివేళ నైట్‌ విజన్‌ గాగుల్స్‌ (ఎన్‌వీజీ) సాయంతో సీ-130జే విమానాన్ని తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో విజయ వంతంగా దింపింది. ఈ విషయాన్ని వాయుసేన ‘ఎక్స్‌’లో

చిమ్మచీకట్లో వాయుసేన ఫీట్‌.. ఇదే తొలిసారి

న్యూఢిల్లీ, మే 23: భారత వాయుసేన మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారిగా రాత్రివేళ నైట్‌ విజన్‌ గాగుల్స్‌ (ఎన్‌వీజీ) సాయంతో సీ-130జే విమానాన్ని తూర్పు సెక్టార్‌లోని అడ్వాన్స్‌డ్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో విజయ వంతంగా దింపింది. ఈ విషయాన్ని వాయుసేన ‘ఎక్స్‌’లో వెల్లడిస్తూ రెండు వీడియో క్లిప్‌లను జత చేసింది. ఒక క్లిప్‌లో ఎన్‌వీజీ సహాయంతో విమానం దిగడం కనిపించింది. రెండో క్లిప్‌లో విమానం లోపలి నుంచి బయటి ప్రాంతం ఎలా కనిపిస్తుందో ఉంది. దేశ సార్వభౌమత్వ పరిరక్షణకు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటామని, తమ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఐఏఎఫ్‌ ఆ పోస్టులో పేర్కొంది. రాత్రివేళల్లో కూడా వాయుసేన ఆపరేషన్లు నిర్వహించడంలో ఎన్‌వీజీ సాంకేతిక కీలక పాత్ర పోషించనుంది. వాయుసేన కొన్నాళ్ల కిందట నియంత్రణ రేఖ వద్ద కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ మీద ఇదే విమానాన్ని రాత్రివేళ విజయవంతంగా దింపింది. తక్కువ స్థలంలోనే ల్యాండింగ్‌, టేకాఫ్‌ కావడం సీ-130జే ప్రత్యేకత. ఒడిసా, ఝార్ఖండ్‌, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ రాష్ట్రాలు తూర్పు సెక్టార్‌ పరిధిలోకి వస్తాయి.

Updated Date - May 24 , 2024 | 05:34 AM

Advertising
Advertising