ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lakshadweeps: లక్షద్వీప్ లక్ష్యం ఇదేనా..!

ABN, Publish Date - Jan 10 , 2024 | 11:37 AM

లక్షదీవుల (Lakshadweep) దశ ఇక మారనుంది. కొత్తగా విమానాశ్రయాల (Airports) విస్తరణ, కొత్త హోటళ్ల (Hotels) నిర్మాణం జరుగుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది.

న్యూఢిల్లీ: లక్షదీవుల (Lakshadweep) దశ ఇక మారనుంది. కొత్తగా విమానాశ్రయాల (Airports) విస్తరణ, కొత్త హోటళ్ల (Hotels) నిర్మాణం జరుగుతుంది. పర్యాటకులను ఆకర్షించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రధాని మోదీ (Modi) పర్యటనతో వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లక్షదీవులకు (Lakshadweep) మహార్దశ వచ్చింది.

లక్షదీవుల (Lakshadweep) అభివృద్ధి కోసం స్థానిక అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో ప్రధానమైంది మినికాయ్ ద్వీపం వద్ద విమానాశ్రయం. ఇప్పటికే ఇక్కడ ఎయిర్ పోర్టు (Airport) ఉంది. దానిని దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా విస్తరిస్తున్నారు. ఎయిర్ బస్ లాంటి భారీ విమానం ల్యాండ్ అయ్యేలా నిర్మాణం చేపడుతున్నారు. మరో విశేషం ఏంటంటే మినికాయ్ ద్వీపం మాల్దీవులకు దగ్గరగా ఉంటుంది. అగట్టి దీవుల్లో చిన్న ఎయిర్ పోర్టు ఉంది. దానిని విస్తరణ కూడా చేపట్టారు. ఎయిర్ పోర్టు విస్తరిస్తే పర్యాటకుల రాక పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా వర్జిన్ ద్వీవుల్లో పలు హోటళ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి.

పర్యాటకులను ఆహ్వానించడంలో భాగంగా లక్షదీవుల్లో (Lakshadweep) ఎంపిక చేసిన ప్రాంతాల్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చారు. స్థానికంగా ఉన్న కొబ్బరి చెట్ల నుంచి నీరా అందించేందుకు అంగీకారం తెలిపారు. లక్షదీవుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంతో పర్యాటకులను మరింత ఆకర్షిస్తామని అధికారులు ధీమాతో ఉన్నారు. లక్షదీవులకు విమానం లేదంటే షిప్‌లో వెళ్లేందుకు అవకాశం ఉంది. కొచ్చి నుంచి లక్షదీవులకు ప్రతీరోజు విమానాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 10 , 2024 | 12:07 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising