అఖిలపక్ష సమావేశం.. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ABN, Publish Date - Nov 24 , 2024 | 10:06 AM
పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament Winter Sessions) సోమవారం నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు (Kiren Rijiju) ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, కిరెన్ రిజిజు, వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం, జనసేన, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కీలక బిల్లుల ఆమోదానికి సహకారం, రాజ్యాంగం ఏర్పాటై 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలపై అఖిల పక్షంలో చర్చ జరగనుంది. అదానీ వ్యవహారం, మణిపూర్ అల్లర్లు, వక్ఫ్ సవరణ బిల్లు, చైనా సరిహద్దు అంశం సహా ప్రజా సమస్యలను అఖిలపక్షంలో విపక్షాలు లేవనెత్తనున్నాయి.
కాగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు 25వ తేదీ నుంచి డిసెంబరు 20 వరకు జరుగనున్నాయి. వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. వీటిని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు. సంవిధాన్ సదన్‌లోని సెంట్రల్ హాలులో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో శుక్రవారం ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌కి రావాల్సిన ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్.. ప్రధాన లక్ష్యంగా తీసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విజన్ డాక్యుమెంట్‌కు కేంద్ర సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలను ఒక వేదికగా చేసుకుని ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఎలా తీసుకు రావాలనేది ఒక డాక్యుమెంట్‌తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సెకీ ఒప్పందంపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలిస్తోందన్నారు. ఆ క్రమంలో న్యాయ నిపుణుల సలహాకు అనుగుణంగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విచారణ చేపట్ట వచ్చా అనే అంశాన్నిసైతం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
లోక్‌సభ ఎంపీ, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు తీసుకు వస్తామన్నారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణాన్నిసైతం ముందుకు తీసుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కూటమిలో పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు.. ఈ సమావేశాల్లో సమయానుకూలంగా స్పందిస్తామని తెలిపారు. ఏపీ ఎంత అప్పుల ఊబిలో ఉందనే విషయాన్ని గత సమావేశాల్లోనే పార్లమెంట్ దృష్టికి తీసుకు వెళ్లామని ఈ సందర్భంగా ఎంపీ లావు కృష్ణదేవరాయులు గుర్తు చేశారు. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహంపై ఎంపీలతో సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై సైతం ఎంపీలతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధారాలతో అడ్డంగా బుక్కైన జగన్..
హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసుల తనిఖీలు..
సోషల్ మీడియా సైకోలపై ఉక్కుపాదం
జగన్‌ను బయట ఉంచి తప్పు చేస్తున్నారు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 24 , 2024 | 10:06 AM